Breaking News

టాపిక్‌.. ప్లేస్‌.. డేట్‌.. టైమ్‌ రేవంత్‌ చెప్పాలి: కేటీఆర్‌

Published on Wed, 07/01/2026 - 16:16

సాక్షి, హైదరాబాద్‌: తమ పాలనలో కేంద్రం సహకరించకపోయినా అభివృద్ధి చేశామని.. బీఆర్‌ఎస్‌ పాలనలో నిర్మించిన కట్టడాలను చూసి ఇతర రాష్ట్రాల సీఎంలు కూడా ప్రశంసిస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. బుధవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నాలుగేళ్లలోనే ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ కట్టామన్న కేటీఆర్‌.. సీఎం రేవంత్‌రెడ్డి కేంద్రం నుంచి రాష్ట్రానికి ఏం తెచ్చారంటూ ప్రశ్నించారు.

‘‘రాష్ట్ర అప్పులపై సీఎం రేవంత్‌, డిప్యూటీ సీఎం పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. సీఎం రేవంత్‌ తీరుతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుంది. బీఆర్‌ఎస్‌ హయాంలో  రాష్ట్ర ఆదాయం నెలకు రూ.18,500 కోట్లు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై సీఎం రేవంత్‌ పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి అరాచక పాలన చేస్తున్నారు. రుణమాఫీ పేరుతో రైతులకు సీఎం రేవంత్‌ రూ.29 వేల కోట్లు ఎగ్గొట్టారు. అబద్దాలు చెప్పడం సీఎం రేవంత్‌ జన్మహక్కు’’ అంటూ కేటీఆర్‌ దుయ్యబట్టారు.

‘‘సీఎం రేవంత్‌, ఆయన సోదరులు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. డబ్బులు లేవంటూనే రూ.200 కోట్లతో అందాల పోటీలు నిర్వహించారు. సీఎం రేవంత్‌ రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. సీఎం రేవంత్‌తో చర్చకు నేను సిద్ధం. టాపిక్‌.. ప్లేస్‌, డేట్‌.. టైమ్‌ రేవంత్‌ చెప్పాలి. సవాల్‌ విసిరి పారిపోయే అలవాటు సీఎం రేవంత్‌దే. మీ తప్పులను బయటపెట్టకపోతే రాజకీయాలను నుంచి తప్పుకుంటా. ఉద్యోగాలు, రైతు డిక్లరేషన్‌.. దేనిపైనైనా చర్చకు రెడీ’’ అంటూ కేటీఆర్‌ సవాల్‌ విసిరారు. 

 

 

Videos

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)