Breaking News

ప్రశ్నిస్తానన్న పవన్‌.. ఏమైపోయావ్‌?: కొట్టు సత్యనారాయణ

Published on Wed, 06/18/2025 - 15:18

సాక్షి, పశ్చిమగోదావరి:  కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో ప్రజలు మోసపోయారని.. రాష్ట్రంలో ఎక్కడ అన్యాయం జరిగిన ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ ఏమైపోయారంటూ మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ నిలదీశారు. బుధవారం ఆయన ‘‘జగన్ అంటే నమ్మకం-చంద్రబాబు అంటే మోసం’’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ.. ఏపీలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి లోకేష్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారంటూ మండిపడ్డారు.

‘‘చంద్రబాబు 1 లక్ష 50 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి తమ యంత్రాంగానికి దోచిపెడుతున్నారు. యువగళం పాదయాత్రలో జాబ్ క్యాలెండర్‌ ఇస్తానన్న లోకేష్ ఆ హామీ మరిచిపోయారా?. తల్లికి వందనం పథకంపై కూటమి నాయకులు డబ్బులు కోరుకుంటున్నారు. ఏడాది కూటమి పాలనలో స్త్రీ శక్తి పథకం డబ్బులు ఎవరికీ వేశారు?. రాష్ట్ర మహిళలు ఉచిత బస్సులో ప్రయాణిస్తున్నారా?. ఏ ఆగస్ట్‌లో ఈ ఉచిత బస్సు అమలు చేస్తారు?’’ అంటూ కొట్టు సత్యనారాయణ ప్రశ్నించారు.

‘‘కూటమి పాలనలో వ్యవసాయ రంగంలో పూర్తిగా దెబ్బతింది. ప్రజలు ప్రభుత్వన్ని నిలదీస్తారని రాష్ట్రంలో డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు. వైఎస్‌ జగన్ హయాంలో డీబీటీ ద్వారా నేరుగా ప్రజల అకౌంట్‌లో డబ్బులు జమ చేసేవాళ్లం. పోలవరం ప్రాజెక్టు సృష్టికర్త వైఎస్సార్‌పై కూడా విమర్శలు చేస్తున్నారు. 1 లక్ష 50 వేల కోట్లలో పోలవరానికి ఎంత కేటాయించారు?. మైనింగ్ కార్పొరేషన్‌లో గనులకు వచ్చే లక్షల కోట్ల రూపాయల మధ్యవర్తుల జేబుల్లోకి వెళ్తున్నాయి’’ అని కొట్టు సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘‘పిఠాపురంలో జనసేన కార్యకర్త అన్యాయన్నీ ప్రశ్నించాడని ఊరు నుంచి వెలివేస్తే పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదు. సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో మహిళను చెట్టుకు కట్టేస్తే వీడియో కాల్‌లో పరామర్శిస్తారా?’’ అంటూ కొట్టు సత్యనారాయణ మండిపడ్డారు.

 

Videos

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)