Breaking News

అందుకే ఫుట్‌బాల్‌ తీసుకొచ్చా: కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

Published on Wed, 08/27/2025 - 12:46

హైదరాబాద్‌, సాక్షి: తెలంగాణ బీజేపీ ఫుట్‌ బాల్‌ పాలిటిక్స్‌లో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. చేవెళ్ల బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి యూటర్న్‌ తీసుకున్నారు. ఆయన వ్యాఖ్యల ఆధారంగా ప్రచురితమవుతున్న అసంతృప్తి కథనాలను తోసిపుచ్చుతూ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 

తెలంగాణ బీజేపీ వ్యవహారంపై అసంతృప్తితోనే తాను ఫుట్‌బాల్‌ గిఫ్ట్‌ ఇచ్చినట్లు వస్తున్న కథనాలను చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఖండించారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌తో ఫుట్‌బాల్‌ ఆడాలనే తీసుకొచ్చానంటూ ప్రకటించారు. ‘‘తెలంగాణలో బీఆర్‌ఎస్‌ పని అయిపోయింది. కాంగ్రెస్‌తోనే బీజేపీకి పోటీ.  రేవంత్‌ మంచి ఫుట్‌బాల్‌ ప్లేయర్‌. అందుకే ఎలా ఆడుకోవాలో తెలియజేయడానికే ఫుట్‌బాల్‌ తీసుకొచ్చా. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌తో ఫుట్‌బాల్‌ ఆడుతాం అని అన్నారాయన. 

ఇదిలా ఉంటే.. బీజేపీ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌ తివారీకి కానుకగా ఫుట్‌బాల్‌ ఇవ్వడం ఆసక్తికర చర్చకు దారి తీసింది. రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లో పార్టీ వ్యవహారంపై విశ్వేశ్వర్‌రెడ్డి గుర్రుగా ఉన్నారని.. అధిష్టానం పెద్దలు ఒకరి దగ్గరకు వెళ్తే.. మరొకరి దగ్గరికి వెళ్లమంటూ ఫుట్‌బాల్‌ ఆడుకుంటున్నారని.. ఈ నేపథ్యంలోనే ఇలా ఫుట్‌బాల్‌ ఇచ్చి నిరసన తెలిపారనే చర్చ నడిచింది.ఈ పరిణామంపై మాజీ బీజేపీ నేత, గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ సైతం స్పందిస్తూ.. కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి మద్దతు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని ఫుట్‌బాల్స్‌ బయటకు వస్తాయంటూ తెలంగాణ బీజేపీ నేతలను ఉద్దేశిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే ఈలోపే కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఖండనకు దిగడం గమనార్హం.

ఫుట్‌బాల్‌ ఆరోపణలను ఖండించిన ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి

‘ఏదైనా విషయంపై మిమ్మల్ని కలిస్తే పార్టీ అధ్యక్షుడు రామచందర్‌రావును కలవమని, ఆయన్ను కలిస్తే రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి అభయ్‌పాటిల్‌ను కలవమని చెబుతూ నన్ను ఫుట్‌బాల్‌ ఆడుకుంటున్నారు. అందుకే మీకు అదే బహుమానంగా ఇస్తున్నాను.. మంగళవారం కొండా చేసిన వ్యాఖ్యలు..

ఇదీ చదవండి: ఎంత బాధ ఉంటే ఆయన అలా చేస్తారు?

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)