Breaking News

రేవంత్‌ నాయకత్వంలో ఒక్కటిగా ఉన్నాం 

Published on Fri, 04/12/2024 - 01:20

రామగిరి (నల్లగొండ): తెలంగాణలో రాబోయే పదేళ్లు కాంగ్రెస్‌ పార్టీనే అధికారంలో ఉంటుందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తమ పారీ్టలో గ్రూపుల్లేవనీ, ఏక్‌నాథ్‌ షిండేలూ లేరని వ్యాఖ్యానించారు. రంజాన్‌ పండుగ సందర్భంగా గురువారం నల్లగొండ పట్టణంలోని ఈద్గా వద్ద జరిగిన ప్రార్థనల సందర్భంగా మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి, నల్లగొండ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్‌రెడ్డితో కలసి మంత్రి కోమటిరెడ్డి మాట్లాడారు. ఎవరెన్ని మాటలు చెప్పినా రేవంత్‌రెడ్డి ఇంకోసారి సీఎంగా కొనసాగుతారన్నారు.

2028 అసెంబ్లీ ఎన్నికల్లో 125 సీట్లను గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో ఐదు గ్రూపులు ఉన్నాయంటూ హరీశ్‌రావు, మహేశ్వర్‌రెడ్డి విజ్ఞత లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో సీనియర్‌ నాయకుల సలహాలతో మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక్కటిగా పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో 14 సీట్లు గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తాను చనిపోయే వరకు కాంగ్రెస్‌ పార్టీలోనే ఉంటానని స్పష్టం చేశారు. 

ఇంకోసారి అలా మాట్లాడొద్దు 
కాంగ్రెస్‌ పార్టీలో అంతర్గత విషయాల గురించి కానీ, గ్రూపులు ఉన్నాయని కానీ ఇంకోసారి మాట్లాడొద్దని హరీశ్‌రావు, మహేశ్వర్‌రెడ్డిని మంత్రి కోమటిరెడ్డి హెచ్చరించారు. అలానే అకారణ విషయాల్లో తన పేరు ప్రస్తావించొద్దని సూచించారు. ప్రభుత్వాన్ని పడగొడతామని చెబుతున్న బీజేపీ, బీఆర్‌ఎస్‌లు లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క సీటు అయినా గెలవాలని సవాల్‌ విసిరారు. 

షిండేల సృష్టి బీజేపీ పనే 
కాంగ్రెస్‌లో ఏక్‌నాథ్‌ షిండేలు ఉన్నారని మహేశ్వర్‌రెడ్డి మాట్లాడటం విడ్డూరంగా ఉందనీ... మహారాష్ట్రలో అధికారం కోసం ఏక్‌నాథ్‌ షిండేలను సృష్టించిన ఘనత బీజేపీదేనని ఆయన నిందించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్‌ను దించి కిషన్‌రెడ్డిని ఎందుకు మార్చారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. దేశంలో కులమతాల మధ్య ఘర్షణలు పెట్టి 370 నుంచి 400 ఎంపీ సీట్లు గెలవాలని బీజేపీ కలలు కంటోందని ఆయన ఎద్దేవా చేశారు. నల్లగొండ ఎంపీగా కుందూరు రఘువీర్‌రెడ్డిని భారీ మెజారీ్టతో గెలిపించాలని పిలుపునిచ్చారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)