Breaking News

చిన్న పార్టీలు వద్దు.. జాతీయ పార్టీలతోనే దేశం ఐక్యం: కోమటిరెడ్డి

Published on Mon, 11/06/2023 - 11:15

సాక్షి, నల్లగొండ: జాతీయ పార్టీలతోనే దేశం ఐక్యంగా ఉంటుందన్నారు కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అలాగే, తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీదే అధికారం అని చెప్పుకొచ్చారు. అన్ని రాష్ట్రాల్లో చిన్న(ప్రాంతీయ) పార్టీలే అధికారంలోకి వస్తాయని సీఎం కేసీఆర్ అనడం‌‌ సిగ్గుచేటు అంటూ ఘాటు విమర్శలు చేశారు. 

కాగా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోమవారం నల్లగొండలో మీడియాతో మాట్లాడుతూ..‘జాతీయ పార్టీ అని చెప్పుకుంటూ చిన్న పార్టీలే అధికారంలోకి వస్తాయని సీఎం కేసీఆర్ మతిభ్రమించి మాట్లాడుతున్నాడు. చిన్న పార్టీలు గెలిచి ప్రధాని మోదీకి సపోర్ట్ చేసి దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి కుట్రలు చేస్తున్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దేశ సంపదను అంబానీ, ఆదానీలకు దోచిపెడుతోంది. ప్రధాని మోదీ అందరి అకౌంట్లో 15 లక్షలు వేస్తా, సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు వేస్తా అన్నాడు. పది సంవత్సరాల నుంచి ఇంతవరకు ఎవరి అకౌంట్‌లోనూ పైసా వేయలేదు, ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. 

కేసీఆర్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి. ప్రగతి భవన్ ఖాళీ చేయాల్సి వస్తుందన్న ఆందోళనతో కేసీఆర్‌ నోటికొచ్చినట్లుగా మాట్లాడుతున్నాడు. జాతీయ పార్టీ అని చెప్పి మహారాష్ట్రలో పనికిమాలిన నాయకులను బీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నాడు. వారిని ప్రగతి భవన్ తీసుకువచ్చి బిర్యానీలు పెట్టాడు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిని పక్కదారి పట్టించడానికి కేసీఆర్ కొత్త నాటకం ఆడుతున్నాడు. రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా రుణమాఫీ చేయడం లేదు. తెలంగాణ కోసం ఎంతోమంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు’ అంటూ కామెంట్స్‌ చేశారు. 

ఇది కూడా చదవండి: దీపావళి ప్రత్యేక రైళ్లు

Videos

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)