Breaking News

TS: బరాబర్‌ బొంద పెడతాం

Published on Mon, 01/22/2024 - 04:35

సాక్షి, యాదాద్రి: ‘ప్రభుత్వం ఆరు నెలల్లో పడిపోతుందని కేటీఆర్‌ కలలు కంటున్నాడు. కానీ బీఆర్‌ఎస్‌కు చెందిన 39 మంది ఎమ్మెల్యేలను 39 ముక్కలుగా విభజిస్తాం.. మీ పార్టీని 14 ముక్కలు చేస్తాం.. మా ముఖ్యమంత్రి చెప్పినట్టుగా బీఆర్‌ఎస్‌ పార్టీని మేము బరాబర్‌ బొంద పెడతాం’ అని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. తొలిసారి యాదాద్రి జిల్లా భువనగిరికి వచ్చిన కోమటిరెడ్డి, ఆదివారం జిల్లా కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు.

కేటీఆర్‌ అధికారం పోయిన షాక్‌లో పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని విమర్శించారు. 100 రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దోచుకున్న అవినీతి సొమ్ముతో 20 సంవత్సరాలు సంక్షేమ పథకాలు అమలు చేయవచ్చని అన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వం ఆరు లక్షల కోట్లు అప్పులు చేసిందని, పేదల భూములు లాక్కుందని ధ్వజమెత్తారు. ప్రస్తుతం తమ ప్రభుత్వం తెలంగాణను గాడిలో పెడుతోందన్నారు.

త్రిపుల్‌ఆర్‌ తెలంగాణకు మణిహారమని, రైతులు కోరుతున్నట్లు దీని అలైన్‌మెంట్‌ మార్చడానికి ప్రయత్నం చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. యాదాద్రి థర్మల్‌ ప్లాంట్‌లో 10 వేల కోట్ల అక్రమాలు జరిగాయని ఆరోపించారు. మంత్రి వెంట ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, జెడ్పీ మాజీ చైర్మన్‌ కసిరెడ్డి నారాయణరెడ్డి ఉన్నారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)