Breaking News

బీఆర్‌ఎస్‌ పునాదులు లేకుండా చేస్తాం    

Published on Thu, 04/18/2024 - 05:21

నల్లగొండ: ‘కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని టచ్‌ చేస్తే బీఆర్‌ఎస్‌ పార్టీ పునాదులు లేకుండా చేస్తాం. కాంగ్రెస్‌ కార్యకర్తలు పదేళ్ల పాటు కష్టపడి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. మీరు మా ప్రభుత్వాన్ని కూలగొడతామంటే చూస్తూ ఊరుకోరు’అని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన నల్లగొండలోని తన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.

‘కాంగ్రెస్‌ ప్రభుత్వం పడిపోతుంది.. రేవంత్‌ బీజేపీలోకి పోతాడు అని కేటీఆర్‌ అంటే.. రాజకీయాలు తెలియని బచ్చాగాడులే అనుకున్నాం. పదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన నీవు.. ప్రజాస్వామ్య బద్ధంగా పూర్తి మెజారీ్టతో ఏర్పడిన ప్రభుత్వం సంవత్సరంలో పడిపోతుందని ఏ విధంగా అన్నావు’అని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ను ప్రశ్నించారు. ‘మా ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ఏం కుట్రలు చేస్తున్నావు.

మేము గేట్లు తెరిస్తే 30 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇక మిగిలేది కుటుంబంలోని మీ బంధువులైన ఎమ్మెల్యేలే’అని మంత్రి అన్నారు. ‘నీ కూతురు లిక్కర్‌ కేసులో తీహార్‌ జైలులో ఉంది. ఇంకా బుద్ధి రాలేదా’అని మండిపడ్డారు. అవినీతి కేసుల్లో తండ్రీ కొడుకులు జైలుకు పోక తప్పదన్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌కు పాల్పడి, భార్యాభర్తలు మాట్లాడుకునే మాటలు విన్న నీచులని విమర్శించారు.  

కేసీఆర్‌ది దొంగ దీక్ష.. 
కేసీఆర్‌ తెలంగాణ ఉద్యమం సమయంలో డీ విటమిన్‌ టాబ్లెట్‌ వేసుకుని దొంగ దీక్ష చేసి.. చావు నోట్లో తలకాయ పెట్టానని ప్రజలను మోసం చేశారని మంత్రి కోమటిరెడ్డి ఆరోపించారు. ‘నువ్వొక పాస్‌పోర్టు దొంగవు.. డబ్బులు దోచుకున్నవు. నీలాంటోడే సీఎం అయినప్పుడు. రైతు కుటుంబం నుంచి వచ్చిన రేవంత్‌రెడ్డి జెడ్పీటీసీగా, ఎమ్మెల్యేగా, ఎంఎల్‌సీగా, ఎంపీగా పనిచేశారు. ఆయన సీఎం కాకూడదా’? అని ప్రశ్నించారు.   కాంగ్రెస్‌ పార్టీ 14 ఎంపీ సీట్లలో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.  

ఎన్టీఆర్‌ సర్కార్‌ను కూల్చడంలో కేసీఆర్‌ పాత్ర  
‘కేసీఆర్‌ మమ్మల్ని వెంటాడతా అంటుండు. ఆయన ముసలోడు. మాకు ఏ కట్టే అవసరం లేదు. మేముబలంగా ఉన్నాం. మేమే వెంటాడి వేటాడతాం’అని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. ఆనాడు ఎన్టీఆర్‌ ప్రభుత్వాన్ని కూల్చడంలో కేసీఆర్‌ పాత్ర కూడా ఉందని ఆరోపించారు. జూన్‌ 5 నుంచి పాలన స్పీడ్‌ చేస్తామని, ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని స్పష్టం చేశారు. రూ.2 లక్షల రుణమాఫీని కూడా అమలు చేస్తామని చెప్పారు.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)