Breaking News

తిరువూరు టీడీపీలో రచ్చకెక్కిన విభేదాలు

Published on Sat, 08/02/2025 - 21:05

ఎన్టీఆర్‌ జిల్లా: తిరువూరు టీడీపీలో విభేదాలు  రచ్చకెక్కాయి. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుపై తిరువూరు తమ్ముళ్ల తిరుగుబాటు జెండా ఎగురవేశారు. టీడీపీ పార్టీని, ప్రభుత్వాన్ని, ఎంపీని ఎమ్మెల్యే కొలికపూడి అల్లరి చేస్తున్నారంటూ తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఎమ్మెల్యే.. పార్టీని, ఎంపీని బదనాం చేస్తున్నారు.. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచన ఎమ్మెల్యేకి కనిపించడం లేదు.. ఎమ్మెల్యే వైఖరిని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం’’ అంటూ మండిపడ్డారు.

‘‘ఒక పథకం ప్రకారమే ఎమ్మెల్యే కొలికపూడి ఇలా చేస్తున్నారు. కొలికపూడితో వివాదాలన్నీ టీడీపీ వారితోనే. ఎమ్మెల్యే కొలికపూడి వల్ల టీడీపీ తీవ్రంగా నష్టపోతోంది. కొలికపూడిని ఎంపీ కేశినేని చిన్ని కోట్లు ఖర్చుపెట్టి గెలిపించుకున్నారు. ఎమ్మెల్యే కొలికపూడి పార్టీకి, ఎంపీకి నమ్మకంగా ఉండాలి. ఏవైనా మనస్పర్థలు ఉంటే మమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడాలి. తిరువూరులో పార్టీ, ప్రభుత్వం, ఎంపీ అల్లరవుతున్నారు తప్ప.. ఏం అభివృద్ధి జరిగింది’’ అంటూ తిరువూరు తమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారు.

కాగా, తిరువూరు టీడీపీలో ఇసుక పంచాయతీ మళ్లీ రచ్చకెక్కిన సంగతి తెలిసిందే. ఇసుక అక్రమ రవాణాలో పోలీసుల పాత్ర ఉందంటూ టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు.. తమను ఎవరూ ఏం చేయలేరంటూ ఎంపీ కేశినేని చిన్ని అనుచరులు బెదిరింపులకు దిగడం గమనార్హం.

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)