Breaking News

నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తా.. చంద్రబాబుకు కొడాలి నాని సవాల్‌

Published on Fri, 04/14/2023 - 12:04

సాక్షి, కృష్ణా జిల్లా: రాష్ట్ర ప్రజలు చంద్రబాబును విశ్వసించే పరిస్థితి లేదని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. 2019లో వచ్చిన ఫలితాలే 2024లో రిపీట్‌ అవుతాయన్నారు. శుక్రవారం ఆయన గుడివాడలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్రానికి చంద్రబాబు చేసింది ఏమీలేదన్నారు. గుడివాడలో 23 వేల మంది పేదలకు ఇళ్లు ఇస్తున్నాం. గుడివాడ అభివృద్ధిపై చంద్రబాబుతో చర్చకు నేను సిద్ధం’’ అంటూ సవాల్‌ విసిరారు.

‘‘చంద్రబాబు 14 ఏళ్లు గుడివాడను గాలికి వదిలేశారు. ఇప్పుడు సిగ్గులేకుండా వచ్చి అవాస్తవాలు మాట్లాడుతున్నారు. ఎప్పుడూ లేని విధంగా ప్రస్తుతం గుడివాడలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. గుడివాడకు చంద్రబాబు ఏం చేశారు? గుడివాడలో చంద్రబాబు ప్రచారం చేసిన ప్రతిసారి టీడీపీ ఓడిపోయింది. పేదల ఇళ్ల కోసం చంద్రబాబు ఒక్క ఎకరం కొన్నట్లు నిరూపించగలరా?. చంద్రబాబు నిరూపిస్తే నేను రాజకీయాలు వదిలేస్తా. చంద్రబాబు జిత్తులమారి నక్క’’ అంటూ కొడాలి నాని దుయ్యబట్టారు.

‘‘సభలో ఖాళీ కుర్చీలకు చంద్రబాబు ఉపన్యాసం ఇచ్చారు. ఎన్టీఆర్‌, బసవతారకం విగ్రహాలు కూడా చంద్రబాబు పెట్టలేదు. మేము పెట్టిన విగ్రహలకు చంద్రబాబు దండలు వేశారు. హరికృష్ణ ఎంపీగా ఉన్నప్పుడు నిమ్మకూరును అభివృద్ధి చేశారు. హరికృష్ణ, జూనియర్‌ ఎన్టీఆర్‌కు ఉన్న చిత్తుశుద్ధి చంద్రబాబుకు లేదు. నిమ్మకూరును ఉద్దరించామని చెబితే ఎవరు నమ్ముతారు?’’ అంటూ కొడాలి నాని నిప్పులు చెరిగారు.
చదవండి: సాక్షి ఎఫెక్ట్‌: ‘సెల్ఫీ’ మాయం.. తోకముడిచిన టీడీపీ నేతలు

Videos

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)