Breaking News

తెలంగాణలో భవిష్యత్తు బీజేపీదే: కిషన్‌రెడ్డి

Published on Thu, 06/06/2024 - 12:34

న్యూఢిల్లీ: తెలంగాణ లోక్‌ సభ ఎన్నికలో​ బీజేపీ మంచి ఫలితాలు సాధించిందని రాష్ట్ర బీజేపీ చీఫ్‌ కిషన్‌రెడ్డి అన్నారు. ఆయన గురువారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. 

‘‘ బీజేపీని నమ్మి తెలంగాణ ప్రజలు 8 సీట్లలో గెలిపించారు. తెలంగాణలో బీజేపీకి ఓట్లు, సీట్లు పెరిగాయి. నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపడుతుండటం సంతోషకరం. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ను కాదని బీజేపీ పట్ల తెలంగాణ ప్రజలు విశ్వాసం చూపించారు. లోక్‌ సభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బీజేపీని ఆదరించారు. 

తెలంగాణలో బీజేపీ బలపడటం ఒక ఆరంభం మాత్రమే. తెలంగాణలో బీజేపీ బలం పెరిగింది. ఇకపై భవిష్యత్తు మాదే. తెలంగాణలో పదేళ్లలో పది లక్షల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. కాంగ్రెస్‌ విష ప్రచారం చేసింది. కాంగ్రెస్‌ గెలిచిన స్థానాల్లో ఆ పార్టీకి పోలింగ్‌ శాతం తగ్గింది.

సీఎం రేవంత్‌రెడ్డి గతంలో గెలిచిన మల్కాజిగిలో మాకు 4 లక్షల మెజార్టీ వచ్చింది. కంచుకోట మెదక్‌లో వందల  కోట్లు ఖర్చు పెట్టినా బీజేపీనే గెలిచింది. సికింద్రాబాద్‌లో కాంగ్రెస్‌ పేరుతో మజ్లిస్‌ పోటీ చేసింది. 8 చోట్ల మేం గెలిచాం. ఆరేడు స్థానాలో రెండో  స్థానంలో నిలిచాం. బీఆర్‌ఎస్‌ 14 చోట్ల మూడో స్థానానికే పరిమితమైంది ’’అని కిషన్‌రెడ్డి అన్నారు.

బీజేపీని నమ్మి తెలంగాణ ప్రజలు 8 సీట్లలో గెలిపించారు

Videos

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)