Breaking News

మహిళలకు ఆరు సీట్లేనా? 

Published on Tue, 08/22/2023 - 02:51

సాక్షి, న్యూఢిల్లీ :చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద బంగారు కుటుంబసభ్యులు చేసినవన్నీ దొంగ దీక్షలేనని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. 33 శాతం రిజర్వేషన్లు అంటూ డిమాండ్‌ చేసి.. 3+3 కలిసి 6 సీట్లే మహిళలకు కేటాయించినట్టుగా ఉందని ఎద్దేవా చేశారు.

‘ఇవేనా మీ బంగారు కుటుంబానికి వచ్చే లెక్కలు? ఇదేనా మహిళలకు మీరు చేయాలనుకున్న న్యాయం?’అంటూ పరోక్షంగా ఎమ్మెల్సీ కవితను ఉద్దేశించి ప్రశ్నించారు. సోమ వారం బీఆర్‌ఎస్‌ అసెంబ్లీ అభ్యర్థుల ప్రక టన అనంతరం కిషన్‌రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. ‘బీఆర్‌ఎస్‌ పార్టీ విడుదల చేసిన జాబితా చూస్తుంటే.. మరోసారి అధికారంలోకి రాలేమని కేసీఆర్‌కు అర్థమైనట్లుగా తెలుస్తోంది.

రోజురోజుకూ ఎస్సీ, ఎస్టీలతో పాటు అన్ని వర్గాల్లో బీజేపీకి పెరుగుతున్న ఆదరణ చూసి కేసీఆర్‌లో ఆందోళన మొదలైంది. గజ్వేల్‌తో పాటు కామారెడ్డి నుంచి కూడా పోటీ చేయాలని కేసీఆర్‌ నిర్ణయించుకోవడం ఆయనలో నెలకొన్న భయానికి నిదర్శనం..’అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.  

దోస్తుకు కేసీఆర్‌ మద్దతు 
‘మతోన్మాద మజ్లిస్‌ అభ్యర్థులను గెలిపించేందుకు, ఆ పార్టీ వ్యతిరేక ఓట్లు చీలేందుకు, ఆయా ప్రాంతాల్లో ఒవైసీ చెప్పిన అభ్యర్థులను బరిలో దించుతూ..కేసీఆర్‌ దోస్తుకు మద్దతుగా నిలుస్తున్నారు..’అని కిషన్‌రెడ్డి విమర్శించారు. హైదరాబాద్‌ ప్రాంతంలో బీఆర్‌ఎస్, మజ్లిస్‌ కలిసి 29 సీట్లు గెలవాలని కేసీఆర్‌ మీడియా సమావేశంలోనే ప్రకటించారని పేర్కొన్నారు. మెజారిటీ ఎమ్మెల్యేలకు మళ్లీ సీట్లు ఇవ్వడం ద్వారా.. కేసీఆర్‌ ఎన్నికల్లో ఓట మిని అంగీకరించారని వ్యాఖ్యానించారు.   

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)