Breaking News

కిర‌ణ్ రిజిజు V/s జైరాం ర‌మేష్‌.. ఎక్స్‌ వార్‌

Published on Mon, 06/24/2024 - 11:39

న్యూ ఢిల్లీ: 18వ లోక్‌సభ తొలి  స‌మావేశాలు నేడు(సోమ‌వారం) ప్రారంభ‌మ‌య్యాయి. లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా బీజేపీ శాసనసభ్యుడు భర్తృహరి మహతాబ్‌తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు.  మూడోసారి ప్ర‌ధానిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన న‌రేంద్ర మోదీతో స‌హా కొత్త‌గా ఎన్నికైన పార్ల‌మెంట్ స‌భ్యులు ఎంపీలుగా ప్ర‌మాణ స్వీకారం కార్య‌క్ర‌మం జ‌రుగుతోంది. జూన్ 26న స్పీక‌ర్ ఎన్నిక‌ల జ‌ర‌గ‌నుంది.

కాగాస‌మావేశాల్లో తొలి రోజే నీట్-యూజీ, యూజీసీ-నెట్‌లో అవకతవకలు, ప్రొటెం నియామకంపై వివాదం, స్పీక‌ర్ ఎన్నిక‌ల వంటి అంశాల‌పై ప్ర‌తిప‌క్షాలు మోదీ ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డ‌నున్న‌ట్లు తెలుస్తోంది.అయితే పార్ల‌మెంట్ స‌మావేశాలు ప్రారంభానికి ముందే అధికార బీజేపీ, ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్‌ లోక్‌స‌భ ఎంపీల మ‌ధ్య మాట‌ల యుద్ధం నెల‌కొంది.

పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌హారాలమంత్రి, బీజేపీ సీనియ‌ర్ నేత కిర‌ణ్ రిజుజు సోమవారం ఉద‌యం18వ లోక్‌స‌భ స‌భ్యుల‌కు స్వాగ‌తం పలుకుతూ సోష‌ల్ మీడియా మాధ్య‌మం ఎక్స్‌లో ట్వీట్ చేశారు. కొత్త‌గా ఎంపికైన ఎంపీల‌కు స్వాగ‌తం. నేడు(జూన్ 24) లోక్‌స‌భ మొద‌టి స‌మావేశం జ‌ర‌గ‌నుంది. పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌హారాల మంత్రిగా స‌భ్యుల‌కు సాయం చేయ‌డానికి ఎల్ల‌ప్పుడూ అందుబాటులో ఉంటాను. స‌భ‌ను సమ‌ర్ధ‌వంతంగా న‌డిపేందుకు స‌భ్యుల నుంచి స‌మ‌న్వ‌యం కోసం ఎదురుచూస్తున్నారు

ఈ పోస్ట్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ జైరాం రమేష్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మాట‌ల కంటే చ‌ర్య‌లు ముఖ్య‌మ‌ని, చెప్పిన మాట‌ల‌ను ఆచ‌ర‌ణ‌లో పెట్టాల‌ని కౌంట‌ర్ ఇచ్చారు.

జైరాం ర‌మేష్ ట్వీట్‌పై కేంద్ర‌మంత్రి రిజిజు బ‌దులిచ్చారు. మీరు సానుకూలంగా సహకరించ‌డ‌మే సభకు గొప్ప ఆస్తి అని పేర్కొన్నారు. "ఖచ్చితంగా. జైరాం ర‌మేష్ జీ.  మీరు తెలివైన సభ్యులు. మీరు సానుకూలంగా సహకరిస్తే స‌భ‌కు విలువైన ఆస్తి అవుతారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీల మధ్య విభేదాలు అలాగే ఉంటాయి. కానీ మ‌న‌మంతా దేశానికి మాసేవ చేసేందుకు ఐక్యంగా ఉన్నాం. భారతదేశపు గొప్ప పార్లమెంటరీ సంప్రదాయాలను కొనసాగించడంలో మీ స‌హ‌కారం ఓసం ఎదురుచూస్తున్నాం." అని  తెలిపారు.

అయితే ఈ సంభాష‌ణ ఇక్క‌డితో ఆగ‌లేదు. కేంద్ర‌మంత్రి ట్వీట్‌కు మ‌రోసారి జైరాం ర‌మేష్ కౌంట‌ర్ ఇచ్చారు.  నీట్ ప‌రీక్ష‌ను నిర్వ‌హించ‌డంలో విఫ‌ల‌మైన నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ అంశాన్ని ప్ర‌స్తావిస్తూ... "ధన్యవాదాలు మంత్రి. నా తెలివితేటలకు మీ సర్టిఫికేట్.. ఎన్టీయే  గ్రేడింగ్ కాద‌ని నేను భావిస్తున్నాను. దీనికేమైనా గ్రేస్ మార్కుల ఉన్నాయా?" అంటూ పంచ్‌లు విసిరారు.
 

Videos

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు