Breaking News

రాహుల్‌కు కిరిణ్‌ రిజిజు కౌంటర్‌.. వారిని ఎగతాళి చేయొద్దు

Published on Sun, 08/25/2024 - 13:36

న్యూఢిల్లీ​: అందాల పోటీ మిస్‌ ఇండియా జాబితాలో కూడా దళిత, ఆదివాసీ వర్గాలకు చోటు దక్కటం లేదని లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలకు కేంద్రమంత్రి కిరణ్‌ రిజిజు కౌంటర్‌ ఇచ్చారు. ఇటువంటి వ్యాఖ్యలు కేవలం ‘బాల బుద్ధి (చిన్న పిల్లలు)మాతమ్రే చేస్తారని ‘ఎక్స్‌’ వేదికగా ఎద్దేవా చేశారు.  

‘ఇప్పుడు రాహుల్‌ గాంధీ మిస్‌ ఇండియా పోటీలు, సినిమాలు, ఆటల్లో రిజర్వేషన్లు కావాలని కోరుకుంటున్నారు. ఇది ‘బాల బుద్ధి’తో వచ్చిన సమస్య కాదు. ఎవరైనా ఆయన చేస్తున్న వ్యాఖ్యలకు ఆనందం వ్యక్తంచేస్తున్నారో వాళ్లు ఆయన వ్యాఖ్యలకు సమాన బాధ్యత వహించినట్లే. చిన్నపిల్లల తెలివితేటలు వినోదానికి మంచివి కావచ్చు. కానీ మీ విభజన వ్యూహాలతో వెనుకబడిన వర్గాలను ఎగతాళి చేయకండి. 

.. ప్రభుత్వాలు మిస్ ఇండియాను, ఒలింపిక్స్‌కు క్రీడాకారులను ఎంపిక చేయవు. సినిమాలకు నటులను ఎంపిక చేయవు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి అత్యున్నత సర్వీసుల రిక్రూట్‌మెంట్లలో రిజర్వేషన్లను మార్చేందుకు సుప్రీంకోర్టు అనుమతించబోదు. కానీ రాష్ట్రపతి పదవిలో ఉన్నది ఓ గిరిజన మహిళ, ప్రధాని ఓబీసీ, రికార్డు సంఖ్యలో ఎస్సీ/ఎస్టీ వర్గాలకు చెందినవారు కేబినెట్‌లో మంత్రులుగా ఉన్నారు.. వారంతా రాహుల్‌ గాంధీకి కనిపించటం లేదు’’ అని కిరణ్‌ రిజిజు అన్నారు.

 

శనివారం రాహుల్‌ గాంధీ ప్రయాగ్‌ రాజ్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ‘ నేను  మిస్‌  ఇండియా పోటీల జాబితాను పరిశీలించాను. అందులో ఒక్క దళిత, ఆదివాసీ, ఓబీసీ మహిళ లేదు. కొంతమంది క్రికెట్‌, బాలీవుడ్‌ గురించి మాట్లాడారు. అందులో కూడా  దళిత, ఆదివాసీలు లేరు. మీడియా రంగలోని టాప్‌ యాంకర్లలో 90 శాతం వెనబడిన వర్గాలకు చెందినవారు కాదు’’ అని అన్నారు. అయితే దేశవ్యాప్తంగా కుల గణనను డిమాండ్‌ చేస్తూ రాహుల్‌ గాంధీ ఈ  వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. 

Videos

సారా అర్జున్ సినిమాలు ఎందుకు తగ్గించింది? అసలు కారణం ఇదేనా?

లోకేశ్ బంపర్ ఆఫర్.. రౌడీయిజం చేస్తేనే మంత్రి పదవి లేకపోతే మీ పవర్ కట్..

ఇంట్లో ఉన్న YSRCP MPTC అభ్యర్థిని లాక్కెళ్లిన SI విజయ్

టీడీపీ గూండాలకు పోలీసులు కొమ్ముకాశారు... ఎవరినీ వదిలిపెట్టం

ధర పెరిగిందని పాత బంగారం అమ్మితే లాభమా? నష్టమా? అసలు లెక్క ఇదే

నేనేంటో చూపిస్తా.. బాబుకు దీప్తి రెడ్డి మాస్ వార్నింగ్

హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో YSRCP సవాల్

ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్ లైన్ ధ్వంసం.. డ్రైవర్ స్పాట్ డెడ్..!

నామినేషన్లకు వస్తే.. కంకర రాళ్లతో కొడతాం

మెగా ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్! మెగా కింగ్ కాంబో?

Photos

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)