Breaking News

మోదీ మళ్లీ పీఎం ఐతే.. ఖర్గే సంచలన వ్యాఖ్యలు

Published on Mon, 01/29/2024 - 19:13

ఢిల్లీ, సాక్షి: బీజేపీపై విమర్శలు సంధించే క్రమంలో కాంగ్రెస్‌ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభకు జరగబోయే చివరి ఎన్నికలు ఇవేనని, ప్రజలు జాగ్రత్తగా ఓటేయాలని కోరుతున్నారాయన. లోక్‌సభకు ఇవే చివరి ఎన్నికలు.. ఈ ఎన్నికల్లో గనుక మోదీ మళ్లీ గెలిచి అధికారంలోకి వస్తే నియంతృత్వమే రాజ్యమేలుతుందని ఆందోళన ‍ వ్యక్తం చేశారు.

అప్పుడు దేశంలో ప్రజస్వామ్యం, ఎన్నికలు ఉండవని అన్నారు. ప్రజలకు ఓటు వేసే అవకావం కూడా ఉండకుండా పోతుంది. కాబట్టి రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో దేశ ప్రజలంతా జాగ్రత్తగా ఓటేయాలని ఖర్గే కోరారు.

ఒడిశాలోని భువనేశ్వర్‌లో కాంగ్రెస్‌ కార్యకర్తల సమావేశంలో సోమవారం ఆయన పాల్గొని ప్రసంగించారు.‘అందిరికీ ‘ఈడీ’ నోటీసులు పంపుతారు. ప్రజలను భయపెడతారు. ఈ భయంతో కొంతమంది స్నేహానికి ద్రోహం చేస్తారు. కొంత మంది పార్టీలకు గుడ్‌బై చెబుతారు. మరికొంత మంది కూటమి నుంచి వైదొలుగుతారు. భాతర రాజ్యాంగం కల్పించిన ఓటు వేయటానికి ఇదే మీకు చివరి ఎన్నికలు. ఈ ఎన్నికల తర్వాత ఇక ఎన్నికలు ఉండవు’ అని ఖర్గే పేర్కొన్నారు. బీజేపీ, ఆ పార్టీకి సైద్ధాంతిక గురువుగా వ్యవహరించే ఆర్‌ఎస్‌ఎస్‌ సంస్థ దేశంలో ‘విషం’ లాంటివని మండిపడ్డారు. 

‘రాహుల్‌ గాంధీ దేశం మొత్తం ఐక్యంగా ఉండాలనుకుంటున్నారు. రాహుల్‌ గాంధీది ప్రేమ దుకా‍ణం.. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ది మాత్రం ద్వేషంతో నిండిన దుకాణం. అందుకే మిమ్మల్ని అప్రమత్తం చేస్తున్నా. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌  రెండూ విషయంతో నిండినవి. ఈ రెండు ప్రజల హక్కులను కాలరాస్తాయి’ అని ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు.

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)