Breaking News

‘ఫొటో సెషన్‌కు సమయం ఉంది.. మణిపూర్‌ పరిస్థితి ఏంటి?’

Published on Sat, 01/06/2024 - 16:43

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఫొటోలు దిగడానికి ఉ‍న్న సమయం.. హింస చెలరేగిన మణిపూర్‌లో పర్యటించడానికి లేదుని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మళ్లికార్జున ఖర్గే దుయ్యబట్టారు. శనివారం ఖర్గే ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇటీవల ప్రధానిమోదీ లక్ష్యదీప్‌ పర్యటనపై ఖర్గే విమర్శలు గుప్పించారు.

ఒకవైపు మణిపూర్‌లో దురదృష్టవశాత్తు రెండు వర్గాల మధ్య హింస చెలరేగితే, మరోవైపు ప్రధాని మోదీ మాత్రం బీచ్‌లో సాహస క్రీడ ఆడుతూ.. ఫొటో సెషన్‌ నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. ఎక్కడికి వెళ్లినా ముందు ఫొటోలకు పోజులు ఇస్తారని ఎద్దేవా చేశారు. ముందు దేవుడి దర్శనంలా ఎక్కడికి వెళ్లినా ప్రధాని మోదీ ఫొటోలే కనిపిస్తాయని మండిపడ్డారు. ఇటువంటి పెద్దమనిషి.. ఎందుకు మణిపూర్‌కు వెళ్లడం లేదు? అని సూటిగా ప్రశ్నించారు. 

ఖర్గే వ్యాఖ్యలను బీజేపీ కేంద్ర మంతి గిరిరాజ్‌ సింగ్‌ ఖండించారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రజలను గందరగోళానికి గురిచేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీవాళ్లు మణిపూర్‌కు కేవలం రాజకీయ విహారయాత్రకు మాత్రమే వెళ్లారని అన్నారు. ప్రధాన మంత్రి మోదీ, హోంశాఖ మంత్రి అమిత్‌ షా.. మణిపూర్‌లో సమస్యల పరిష్కారానికి కృషి​ చేస్తున్నారని తెలిపారు.

చదవండి: రాహుల్‌ గాంధీ యాత్ర: లోగో, స్లోగన్‌ ఆవిష్కరణ

Videos

POLITICAL CORRIDOR: అవును వాళ్లిద్దరూ ఫ్రెండ్స్

మాజీ MLA మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అరెస్ట్

KPHBలో కారు బీభత్సం, డ్రైవర్ నిర్లక్ష్యం..8 కుటుంబాలకు..!

Russia Ukraine War : పుతిన్ ఆఫర్..యుద్ధం ముగిసేనా..?

స్టాక్ మార్కెట్ లో కోట్లు, మోహ్నిష్ పాబ్రాయ్ షాకింగ్ స్టాటజీ

లోకేష్ రాజీనామా చేయాలి

అర్హులకు అన్యాయం.. నకిలీలకు ఉద్యోగాలా?

ఎమ్మెల్యే కూన రవి సంతకాలు చేసిన వారికే టీచర్ ఉద్యోగాలు

ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకో.. పోలీస్ స్టేషన్ లో బాధితుడి గొంతు పట్టుకున్న ఎస్ఐ

ప్రభాకర్ తో మొదలైన ప్రకంపనలు.. ఇకనైనా బాబు, లోకేష్ నోరువిప్పుతారా ?

Photos

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు