చంద్రబాబుపై కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు

Published on Sat, 03/23/2024 - 20:29

సాక్షి, విజయవాడ: ఫోన్ ట్యాపింగ్ చంద్రబాబుకే అలవాటని.. ఏబీ వెంకటేశ్వరరావుతో ఫోన్ ట్యాపింగ్ చేయించింది ఆయనేనంటూ ఎంపీ కేశినేని నాని మండిపడ్డారు. శనివారం ఆయన సాక్షి మీడియాతో మాట్లాడుతూ, గతంలో తన ఫోన్‌ను మోదీ ట్యాపింగ్‌ చేయించారని చంద్రబాబు ఆరోపించాడు.. ఇప్పుడు అదే మోదీతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నాడని దుయ్యబట్టారు.

‘‘చంద్రబాబు ఇప్పుడు ఎన్డీయేలోనే ఉన్నారుగా. దమ్ముంటే ఫోన్ ట్యాపింగ్‌పై విచారణ జరిపించండి. నా ఫోన్‌ని 2018 నుంచి ట్యాప్ చేస్తున్నారు. నా ఫోన్ ట్యాప్ చేసుకున్న  నాకేం భయం లేదు. సీఎం జగన్‌కి, నాకు ఫోన్ ట్యాప్ చేయాల్సిన అవసరం లేదు. ఫోన్ ట్యాప్ చేయడానికి కానిస్టేబుల్‌ని పంపిస్తారా.?. చంద్రబాబు హైదరాబాద్‌లో ఉండి ఫోన్ ట్యాప్ చేయిస్తున్నారు’’ అని కేశినేని పేర్కొన్నారు.

‘‘విజయవాడ టీడీపీ అభ్యర్థి నేర చరిత్ర కలిగిన వ్యక్తి. ఆయన భూ కబ్జాలు, చీటింగ్, నేర చరిత్రలపై త్వరలో పుస్తకాలు వస్తాయి. విశాఖలో డ్రగ్స్ తెప్పించింది చంద్రబాబు సన్నిహితులే. లోఫర్లు, చీటర్లు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు టీడీపీ సీట్లు ఇచ్చింది. దేవినేని ఉమా చాప్టర్ క్లోజ్ అయ్యింది. 100 కోట్లకి చంద్రబాబు ఆ సీటు అమ్మేశాడని దేవినేని ఉమానే చెప్పారు’’ అని ఎంపీ కేశినేని నాని అన్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)