బీఆర్‌ఎస్‌ను వీడుతున్నవారిపై కేసీఆర్‌ సంచలన వ్యాఖ్యలు

Published on Tue, 07/02/2024 - 18:41

సాక్షి,గజ్వేల్‌: పార్టీ పవర్‌లో ఉన్నపుడు అత్యున్నత పదవులు అనుభవించి ప్రస్తుతం పార్టీని వీడుతున్న నాయకులపై బీఆర్‌ఎస్‌ అధినేత సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీని వీడుతున్న వారు నాలుగు రోజులు పదవులు లేకపోతే ఉండలేరా? వారిని చూసి  ప్రజలు అసహించుకుంటున్నారన్నారు.

ఎర్రవెల్లి ఫాంహౌజ్‌లో మంగళవారం(జులై2) జరిగిన పార్టీ జెడ్పీచైర్మన్ల సమావేశంలో కేసీఆర్‌ మాట్లాడారు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చి మరో 15 ఏళ్ళు అధికారంలో ఉంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఒక లక్షణం ఉందని, ఒకసారి అధికారంలోకి వస్తే పిచ్చి పిచ్చి పనులన్నీ చేసి ప్రజల చేత ఛీ అనిపించుకునేలా వాళ్ళు ప్రవర్తిస్తారన్నారు. 

గతంలో ఎన్టీఆర్‌ పాలన తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ దారుణంగా ఓడిపోయిన విషయాన్ని కేసీఆర్‌ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ‘బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో జెడ్పీచైర్మన్‌లందరూ రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు.  విజయవంతంగా పదవీ కాలాన్ని పూర్తి చేసినందుకు అందరికీ శుభాకాంక్షలు. భవిష్యత్తులో మీరంతా  ఉన్నత శిఖరాలను అధిరోహించాలి.

ప్రజా జీవితంలోకి ఒకసారి వచ్చిన తర్వాత అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల కోసం పని చేసేటోళ్లే నిజమైన రాజకీయ నాయకులు. పదేళ్ల  బీఆర్‌ఎస్‌ పాలనలో అన్నీ సవ్యంగా నడిచాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు , తాగు నీటి ఇబ్బందులతో పాటు శాంతి భద్రతల సమస్యలు తలెత్తాయి. మతకల్లోలాలు కూడా చెలరేగడం బాధ కలిగిస్తోంది. 

అప్పుడు ఉన్న అధికారులే ఇప్పుడు ఉన్నారు. అయినా శాంతి భద్రతల సమస్య ఎందుకు వస్తున్నదో ఆలోచించాలి.  గతంలో ఏ ప్రభుత్వాలు చేయని అభివృద్ధిని పదేళ్లలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసి చూపించింది. పార్టీ నాయకులను సృష్టిస్తుంది కానీ నాయకులు పార్టీని సృష్టించరు.  మంచి యువనాయకత్వాన్ని తయారు చేస్తున్నాం’అని కేసీఆర్‌ చెప్పారు.

 

Videos

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)