Breaking News

ఆఖరి నిమిషం దాకా అలర్ట్‌!

Published on Sat, 04/20/2024 - 06:02

సాక్షి, హైదరాబాద్‌: నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమై లోక్‌సభ ఎన్నికల వాతావరణం వేడెక్కుతున్న నేపథ్యంలో అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని బీఆర్‌ఎస్‌ పార్టీ భావిస్తోంది. పార్టీ అభ్యర్థులుగా ఖరారు చేసిన అభ్యర్థులు కొందరు చివరి నిమిషంలో ఇతర పార్టీల్లో చేరడాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఎక్కడా అభ్యర్థులు చేజారిపోకుండా చూడాలని, ఒకవేళ ఎక్కడైనా పార్టీ అభ్యర్థుల నామినేషన్ల దాఖలులో ఇబ్బందులు ఎదురైతే వెంటనే ప్రత్యామ్నాయ అభ్యర్థులను బరిలోకి దించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసింది.

పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌రావు నందినగర్‌ నివాసంలో వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు, మాజీ మంత్రి హరీశ్‌రావు శుక్రవారం ఆయనతో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. కేసీఆర్‌ ఎన్నికల ప్రచార సభలు, బస్సు యాత్ర షెడ్యూల్‌తో పాటు రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, పరిణామాలపై లోతుగా చర్చించారు. లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ నాటికి ఒకరిద్దరు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలతో పాటు కొందరు కీలక నేతలు కూడా పార్టీని వీడే అవకాశమున్నట్లు అంచనా వేశారు. ఎమ్మెల్యేలు లేదా అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జీలు పార్టీ మారిన చోట లోక్‌సభ ఎన్నికల ప్రచారం, సమన్వయ సమస్యలు తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసేందుకు అనుసరించాల్సిన కార్యాచరణను సిద్ధం చేశారు.

గురువారం జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్‌ ప్రస్తావించిన అంశాలు, వాటిపై విపక్ష శిబిరం నుంచి వచి్చన స్పందనపై కూడా ఈ భేటీలో చర్చించినట్లు సమాచారం. ఈ సందర్భంగా కేసీఆర్‌ ఇరువురు నేతలకు పలు కీలక సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల నిధుల వ్యయం అభ్యర్థుల చేతుల మీదుగా కాకుండా పార్టీ పర్యవేక్షణలోనే జరిగేలా చూడాలని ఆదేశించారు. 

రైతాంగ సమస్యలు ఎత్తిచూపేలా యాత్ర 
ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్‌ ఈ నెల 22 నుంచి వచ్చే నెల 10వ తేదీ వరకు చేసే బస్సుయాత్ర తీరుతెన్నులపై సుదీర్ఘంగా చర్చించారు. బస్సు యాత్ర చేయాల్సిన మార్గం, ఏయే తేదీల్లో ఏయే ప్రదేశాల్లో సభలు, వీధి మలుపు (స్ట్రీట్‌ కార్నర్‌) సమావేశాలు ఏర్పాటు చేయాలనే అంశంపై కసరత్తు చేశారు. వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ఉదయం 11 గంటల లోపు ఇటీవల కేసీఆర్‌ చేసిన ‘పొలంబాట’తరహా కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. క్షేత్రస్థాయిలో రైతులు, యువత, మహిళలు, మైనారిటీలు ఇతర సామాజిక వర్గాలతో కేసీఆర్‌ భేటీ అయ్యేలా చేపట్టాల్సిన కార్యక్రమాల జాబితాను సిద్ధం చేశారు.

రైతాంగ సమస్యలను ప్రధానంగా ఎత్తి చూపేలా బస్సు యాత్ర ఉదయం పూట షెడ్యూల్‌ను రూపొందిస్తున్నారు. సాయంత్రం సమయంలో రెండు లేదా మూడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో రోడ్‌షోలు, మినీ సభలు నిర్వహించాలని నిర్ణయించారు. తనతో పాటు బస్సు యాత్రలో పాల్గొనే బృందం బస, భోజన వసతి తదితరాల బాధ్యతలు స్థానికంగా ఎవరికి అప్పగించాలనే అంశంపైనా చర్చ జరిగింది. వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని సభలు, రోడ్‌షోలకు వచ్చే వారికి మంచినీరు, మజ్జిగ ప్యాకెట్ల సరఫరా చేయాలని నిర్ణయించారు. కాగా బస్సు యాత్ర రూట్‌మ్యాప్‌పై లోక్‌సభ నియోజకవర్గాల వారీగా ఆయా జిల్లాల నేతలు ఇప్పటికే తమ ప్రతిపాదనలు అందజేశారు. ఈ ప్రతిపాదనలను క్రోడీకరించి శనివారం సాయంత్రంలోగా కేసీఆర్‌ బస్సు యాత్ర షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశముందని బీఆర్‌ఎస్‌ వర్గాలు వెల్లడించాయి. 

కాంగ్రెస్, బీజేపీల కంటేఓ అడుగు ముందే..! 
లోక్‌సభ నియోజకవర్గాల వారీగా ఇప్పటివరకు జరిగిన సన్నాహక భేటీలను, కేడర్‌ను సన్నద్ధం చేసిన తీరుపై కేసీఆర్‌ సమీక్షించారు. సన్నాహక భేటీలు, సభల నిర్వహణ, ప్రచారంలో బీజేపీ, కాంగ్రెస్‌తో పోలిస్తే ఓ అడుగు ముందు ఉన్నట్లు అంచనాకు వచ్చారు. ఎన్నికల ప్రచారంలో విపక్ష పార్టీలు ప్రస్తావిస్తున్న అంశాలు, ఉపయోగిస్తున్న భాష తదితరాలు భేటీలో ప్రస్తావనకు వచ్చాయి. రెండు జాతీయ పార్టీలను ఇరకాట స్థితిలోకి నెట్టేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు. కేసీఆర్‌ బస్సు యాత్ర కోసం ప్రజలకు చేరువయ్యే రీతిలో కొత్త పాటలను రికార్డు చేసే పనులు సాగుతున్నట్లు పార్టీ నేతలు వెల్లడించారు. ఇలావుండగా శుక్రవారం పలువురు బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కేసీఆర్‌ను కలిశారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)