Breaking News

‘టిప్పూలాగే చేయాలి’.. సిద్ధూకు ప్రాణహానీ? పోలీసులకు కాంగ్రెస్‌ ఫిర్యాదు..

Published on Thu, 05/25/2023 - 17:10

సాక్షి, బెంగళూరు: కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు ప్రాణహాని ఉందని పోలీసులను ఆశ్రయించింది ఆ రాష్ట్ర కాంగ్రెస్. ఈ మేరకు బెదిరింపులకు పాల్పడిన మాజీ మంత్రి అశ్వత్ నారాయణ్‍ పై మైసూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఉరి గౌడ, నంజేగౌడలు టిప్పు సుల్తాన్‌ను అంతం చేసినట్లే.. సిద్ధరామయ్యను సైతం చంపేయాలని పబ్లిక్ మీటింగ్‍లో అశ్వత్ నారాయణ్ మాట్లాడినట్లు కాంగ్రెస్ ఆరోపించింది. అశ్వత్ నారాయణ్‌ను అరెస్టు చేయాలని పోలీసులను కర‍్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) ప్రతినిధి ఎమ్‌ లక్ష్మణ్‌ డిమాండ్‌ చేశారు.  

18 వ శతాబ్దానికి చెందిన మైసూర్ పాలకుడు టిప్పు సుల్తాన్‍. బ్రిటీషర్ల పోరాటంలోనూ టిప్పు సుల్తాన్ మరణించలేదు. కానీ ఒక్కలిగ జాతికి చెందిన ఉరి గౌడ, నంజె గౌడల చేతిలో చనిపోయాడు. 'టిప్పు మద్దతుదారుడు సిద్ధరామయ్య ఇప్పుడు పరిపాలనలోకి వచ్చాడు. మీకు టిప్పు కావాలా? లేక హిందుత్వాన్ని కాపాడిన సావర్కర్ కావాలా?. నంజెగౌడ ఎం చేశారు?. అదే విధంగా సిద్ధరామయ్యను కూడా చేయాలి' అని పబ్లిక్ మీటింగ్‍లో మాట్లాడే క్రమంలో సిద్ధరామయ్యను టిప్పుతో పోల్చుతూ మాజీ మంత్రి అశ్వత్ నారాయణ్ అన్నారు.
(అక్కడ ఐక్యత చూశా.. విపక్షాల బాయ్‌కాట్‌ నిర్ణయంపై ప్రధాని చురకలు!)
 
నేనొస్తే టిప్పు సుల్తాన్ వచ్చినట్టే

అశ్వత్ నారాయణ్ వ్యాఖ్యలపై సిద్ధరామయ్య స్పందించారు. తనపై ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. 'నన్ను అంతం చేయనిస్తారా?. నేను అధికారంలోకి వచ్చానంటే టిప్పు అధికారంలోకి వచ్చినట్టే. టిప్పు సుల్తాన్, కిట్టుర్ రాణి చెన్నమ్మ, సంగోళి రాయన్న అంటే నాకు ఎంతో గౌరవం' అని పబ్లిక్ ర్యాలీలో అన్నారు. అయితే ఫిబ్రవరిలోనే  మాజీ మంత్రి అశ్వత్ నారాయణ్ వ్యాఖ‍్యలపై సిద్ధరామయ్య ఫిర్యాదు చేశారు. కానీ అతనిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ప్రస్తుతం పోలీసులకు కాంగ్రెస్ మరోసారి  ఫిర్యాదు చేసింది.  

నేనలా అనలేదు
ఈ​క్రమంలో తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని మాజీ మంత్రి అశ్వత్ నారాయణ్ చెప్పారు. ఎన్నికల్లో ఓడించాలనే ఉద్దేశంలో ఆ వ్యాఖ్యలు చేశానని అన్నారు. 'నేను సిద్ధరామయ్యను టిప్పు సుల్తాన్‌తో పోల్చాను. సిద్ధరామయ్యకు టిప్పు సుల్తాన్‌పై ఉన్న ప్రేమ గురించి మాట్లాడాను. సిద్ధరామయ్యపై నేనేమీ అవమానకరంగా మాట్లాడలేదు. రాజకీయ, భావజాల వైరుధ్యాలే తప్ప సీఎంపై తనకు వ్యక్తిగతంగా ఎలాంటి క్షక్షపూరిత ఆలోచనలు లేవు.  నా వ్యాఖ్యలు ఏవైనా ఆయన మనోభావాలను దెబ్బతీస‍్తే అందుకు చింతిస్తున్నాను' అని అసెంబ్లీలో మాజీ మంత్రి అశ్వత్ నారాయణ్ చెప్పుకొచ్చారు.
(మనిషి చనిపోయేది రెండు వారాల ముందే తెలుస్తుందా?.. పరిశోధనలు ఏం చెప్తున్నాయి!)

Videos

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Kurnool: YSRCP మహిళలపై TDP మహిళలు దాడి

ఖాకీ చొక్కాల మాటున టీడీపీ గూండాలు.. ఎన్నికలు జరిగితే 100% YSRCPదే గెలుపు..

70MMలో చంద్రముఖి బాబు నిజస్వరూపం

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)