BJP Alliance: బీజేపీతో జట్టు ఖరారు!

Published on Fri, 09/08/2023 - 07:00

ఢిల్లీ/బెంగళూరు: భారతీయ జనతా పార్టీ(BJP), జనతా దళ్‌(సెక్యులర్‌) (JDU) పొత్తు దాదాపు ఖరారు అయ్యింది. 2024 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి.. ఇరు పార్టీలు కలిసే పోటీ చేయాలని ఓ ఒప్పందానికి వచ్చినట్లు సమాచారం. అయితే.. సీట్ల పంపకంపై చర్చలు ఇంకా తుది దశలో ఉన్నాయి. ఆ నిర్ణయం ప్రధానిదేనని తెలుస్తోంది. 

బీజేపీ-జేడీయూ.. ఇరు పార్టీల పొత్తుల గురించి  చాలాకాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా బీజేపీ కీలక నేతలు జేపీ నడ్డాను, అమిత్‌ షాను.. జేడీఎస్‌ అధినేత, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవగౌడ కలిసి చర్చలు జరిపారు. ఈ చర్చల్లో.. లోక్‌సభ పోటీకి గానూ జేడీఎస్‌ ఐదు స్థానాల్ని కేటాయించాలనే ప్రతిపాదనను బీజేపీ ముందు ఉంచింది. అందుకు ఆ ఇద్దరు నేతలు సానుకూలంగానే స్పందించినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయమై తుది నిర్ణయం మాత్రం ప్రధాని మోదీనే తీసుకుంటారని బీజేపీ శ్రేణులు చెబుతున్నాయి. 

బీజేపీ-జేడీఎస్‌ పొత్తు దాదాపుగా ఖరారు అయినట్లే. జులైలో.. సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరి పోరే చేస్తామంటూ చేసిన ప్రకటనను.. పక్కన పెట్టేసి మరీ బీజేపీతో సంప్రదింపులు జరిపారు 91 ఏళ్ల దేవగౌడ. మరోవైపు ఆయన తనయుడు, మాజీ సీఎం కుమారస్వామి సైతం ఇదే తరహాలో స్వరం మార్చారు.  ఈ క్రమంలో.. మాండ్యా, హసన్‌, తుమకురు, చిక్‌బళ్లాపుర్‌, బెంగళూరు రూరల్‌ సీట్లను జేడీఎస్‌ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. 

కర్ణాటకలో మొత్తం 28 లోక్‌సభ స్థానాల ఉన్నాయి. 2019 ఎన్నికల్లో బీజేపీ సోలోగా 25 సీట్లు దక్కించుకుంది. కాంగ్రెస్‌, జేడీఎస్‌ చోరో సీటు దక్కించుకున్నాయి. అందులో హసన్‌ స్థానం నుంచి దేవగౌడ మనవడు ప్రజ్వల్‌ రేవణ్ణ విజయం సాధించాడు. అయితే.. ప్రజ్వల్‌ ఎన్నిక ప్రకక్రియలో అవినీతికి పాల్పడ్డారనే అభియోగాల మేరకు ఆయన ఎన్నికను రద్దు చేస్తూ ఈ మధ్యే కర్ణాటక హైకోర్టు తీర్పు ఇచ్చింది. 

ఇటీవల కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాభవం చెందింది. ఈ నేపథ్యంలో.. లోక్‌సభ స్థానాలను చేజారిపోకుండా ఉండేందుకు ప్రయత్నాలను ప్రారంభించింది.  ఈ క్రమంలోనే ప్రాంతీయ పార్టీలతో పొత్తుకు ముందుకు వస్తోంది. 

ఇదీ చదవండి: అందుకే గుడికి వెళ్లలేదు-సీఎం సిద్ధరామయ్య

Videos

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)