Breaking News

రషీద్‌ది ముమ్మాటికీ రాజకీయ హత్యే: కనుమూరు రవిచంద్రారెడ్డి

Published on Thu, 07/18/2024 - 15:17

తాడేపల్లి, సాక్షి: ఏపీలో పక్కా ప్లాన్‌‌తో  రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని, పరిస్థితులన్నీ ఎమర్జెన్సీని తలపిస్తున్నాయని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కనుమూరు రవిచంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వినుకొండ దారుణ హత్యా ఘటన, ఎంపీ మిథున్‌రెడ్డిపై టీడీపీ శ్రేణులు దాడికి పాల్పడిన ఘటనలపై రవిచంద్రారెడ్డి పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.   

గడిచిన 45 రోజులుగా ఏపీలో జరుగుతున్న హింస ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. ఏకంగా 31 హత్యలు జరిగాయి. సుమారు 35 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. టీడీపీ రాక్షసకాండకు భయపడి 2,750 కుటుంబాలు రాష్ట్రం వదిలి వెళ్లిపోయాయి. ఈ దారుణ పరిస్థితులకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ మంత్రులందరి సమిష్టి బాధ్యత తీసుకోవాలి. గవర్నర్ వెంటనే జోక్యం చేసుకోవాలి. హైకోర్టు కోర్టు కూడా సుమోటోగా తీసుకోవాలి.. అని కోరుతున్నారాయన. 

‘‘.. వినుకొండలో నడిబజారులో‌ రషీద్ ని నరికి చంపారు. రషీద్‌కు ముమ్మాటికీ రాజకీయ హత్యే. అందుకే పోలీసులు ఈ కేసును కప్పిపుచ్చేందుకు యత్నిస్తున్నారు. ఈ తరహా ఘటనతో భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రతీ కార్యకర్తకు అండగా వైఎస్సార్‌సీపీ అధిష్టానం ఉంటుంది అని భరోసా ఇచ్చారాయన. 

ఇదీ చదవండి: వినుకొండకు జగన్‌.. రషీద్‌ కుటుంబానికి పరామర్శ

.. తాజాగా పుంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి చేశారు. కూటమికి ఇందుకేనా ప్రజలు అధికారం ఇచ్చింది?. వారంలోగా శాంతిభద్రతలను అదుపులోకి తీసుకురావాలి. చేయలేక పోతే కూటమి నేతలంతా రాజీనామాలు చేయాలి’’ అని రవిచంద్రారెడ్డి డిమాండ్‌ చేశారు.

Videos

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

నేపాల్ సహాయక చర్యల్లో మరో మిరాకిల్

దివ్యతేజ మృతిపై అనుమానాలు,స్టేషన్ కు వెళ్లి.. శవమై వచ్చాడా..?

డీఎస్సీ ఉద్యోగాలపై బొత్స బాంబు.. 14-15 లక్షలకు పోస్టులు అమ్ముకున్నారు..!

మీ పాదయాత్రలో పాల్గొంటే DSC ఉద్యోగాలు పంచేస్తారా?

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు