Breaking News

‘ఆమె రీల్స్‌ చేస్తే.. ప్రజలేందుకు బాధ్యత తీసుకోవాలి’

Published on Thu, 11/14/2024 - 12:06

ముంబై: విభజన పేరుతో డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌ తప్పడు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ నేత కన్హయ్య కుమార్ మండిపడ్డారు. డీప్యూటీ సీఎం భార్య ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేస్తున్నప్పుడు.. మతాన్ని రక్షించే బాధ్యత ప్రజలెందుకు తీసుకోవాలని ప్రశ్నించారు. 

మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా నాగ్‌పూర్‌లో జరిగిన ర్యాలీని కన్హయ్య కుమార్‌ మాట్లాడారు. రాజకీయ నాయకులకు అహంకారం పెరిగినప్పుడు ప్రజలు సరైన విధంగా వారికి బుద్ధి చెప్పాలని అన్నారు. పేరు ప్రస్తావించకుండా శిక్షణ పొందిన క్లాసికల్ సింగర్, బ్యాంకర్ అయిన అమృతా ఫడ్నవిస్ (దేవేంద్ర ఫడ్నవిస్‌ భార్య) సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారని విమర్శలు చేశారు.

‘‘ఇది ధర్మయుద్ధం.. మతాన్ని రక్షించడం గురించి ప్రసంగాలు చేసే ఏ నాయకులను మీరు (ప్రజలు) ప్రశ్నించండి. మతాన్ని రక్షించే పోరాటంలో నాయకుడి స్వంత కొడుకులు, కుమార్తెలు కూడా పాల్గొంటారా? అని నిలదీయండి. అలా సాధ్యమవుతుందా? నాయకుడి పిల్లలు విదేశాల్లో చదువుతున్నప్పుడు ప్రజానీకం మతాన్ని ఎందుకు కాపాడాలి? 

..ఉపముఖ్యమంత్రి భార్య ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్‌ చేస్తుంటే.. ప్రజలెందుకు మతాన్ని రక్షించే బాధ్యత తీసుకోవాలి?. అమిత్ షా కుమారుడు జై షా మతాన్ని కాపాడటానికి భాగస్వామి అవుతారా? ఆయన బీసీసీఐలో ఐపీఎల్‌ జట్లను ఏర్పాటు చేస్తున్నారు. డ్రీమ్ 11లో టీమ్‌లను తయారు చేయమని మనకు చెబుతున్నారు. వాళ్లు మాత్రం క్రికెటర్లు కావాలని కలలు కంటారు. మనం జూదగాళ్లుగా మిగిలిపోవాలా?’’ అని అన్నారు.

చదవండి: యోగి ఆదిత్యనాథ్‌ విమర్శలపై మండిపడ్డ ప్రియాంక్‌ ఖర్గే

Videos

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)