బాబూ.. ఇసుక దోపిడీలో సోమిరెడ్డిదే ఫస్ట్‌ ర్యాంక్: మాజీ మంత్రి కాకాణి

Published on Fri, 08/02/2024 - 10:47

సాక్షి, నెల్లూరు: ఏపీలో పేదవాడిని దోచుకునేందుకు, టీడీపీ నేతలు జేబులు నింపుకునేందుకే ఉచిత ఇసుక విధానాన్ని కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి. ప్రశ్నించిన వారిపై దొంగ కేసులు పెడుతున్నారు. వారిని భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.

కాగా, మాజీ మంత్రి కాకాణి గురువారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ..‘ఉచిత ఇసుక అంతా భూటకమే.. వినియోగదారుడు మీద పెనుభారం పడుతుంది. పేదవాడిని దోచుకునేందుకు, టీడీపీ నేతలు జేబులు నింపుకునేందుకు ఇసుక విధానం తీసుకొచ్చారు. పొదలకూరు మండలం విరువూరు ఇసుక రీచ్ నుంచి రోజుకి 100 ట్రాక్టర్ల ఇసుక తరలిపోతోంది. అధికారులు పట్టించుకోకపోవడంతో అక్రమ రవాణాను గ్రామస్తులే అడ్డుకున్నారు. ప్రశ్నించిన వారిపై దొంగ కేసులు పెట్టి.. భయబ్రాంతులకు గురి చేస్తున్నారు.

సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి ఇలాకాలో ఇసుక దందా జోరుగా జరుగుతోంది. ఎమ్మెల్యే సోమిరెడ్డి అండదండలతో ఇసుక అక్రమంగా తరలిపోతుంది. ప్రతీలోడ్‌కు ఐదు వేలు వసూలు చేస్తున్నారు. అడ్డుకున్న గ్రామస్తులపై దాడికి ప్రయత్నం చేశారు. ట్రాక్టర్ టక్కులను రీచ్ వద్దనే వదిలేసి టీడీపీ నేతలు పరారు అయ్యారు. సహజ వనరులను టీడీపీ నేతలు దోచుకుంటుంటే అధికారులు పట్టించుకోవడం లేదు. జిల్లా కలెక్టర్, మైనింగ్, ఎస్పీ పనిచేస్తున్నారా?. వైఎస్సార్‌సీపీ హయాంలో ప్రభుత్వానికి ఏడాదికి 790 కోట్లు ఆదాయం వచ్చింది. సామాన్యులకు ఇసుక అందుబాటులో ఉండేది..

సర్వేపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి ఆధ్వర్యంలో ఎన్నాడు జరగని అవినీతి జరుగుతుంది. దీని మీద చంద్రబాబు విచారణ జరిపిస్తే.. సోమిరెడ్డి బాగోతం బయటపడుతుంది. చంద్రబాబు ర్యాంక్‌లు ప్రకటిస్తే.. అవినీతిలో సోమిరెడ్డికి నంబర్ వన్ ర్యాంక్ వస్తుంది. దోపిడీని ఆపకపోతే గ్రామాలకు గ్రామాలు రోడ్డెక్కుతాయి. శాంతిభద్రతలకి విఘాతం కలుగుతుంది. ఇసుక దందాపై జిల్లా యంత్రాంగం ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలి అని డిమాండ్‌ చేశారు.

Videos

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)