Breaking News

ప్రజల దృష్టి మళ్లించాలనే జగన్‌పై దుష్ప్రచారం

Published on Tue, 11/26/2024 - 05:00

నెల్లూరు (బారకాసు): ప్రజల ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రైతుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ వ్యవసాయానికి 25 ఏళ్ల పాటు ఉచిత విద్యుత్‌ అందించడానికి కేంద్ర ప్రభుత్వ సంస్థ సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సెకీ)తో చేసుకున్న ఒప్పందం కేంద్ర ప్రభుత్వం సహా అందరి ప్రశంసలందుకుందని, ఇది చూసి ఓర్వలేకే కూటమి నేతలు దుష్ప్రచారం చేస్తున్నా­రని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి చెప్పారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా వైఎస్‌ జగన్‌ శ్రీకారం చుట్టిన గొప్ప ప్రాజెక్టు ఇది అని చెప్పారు. ఆయన సోమ­వారం ఇక్కడ మీడియా సమావేశంలో మాట్లా­డుతూ.. అత్యంత చౌకగా సోలార్‌ విద్యుత్‌ సెకీ స్వయంగా ముందుకొచ్చి రాష్ట్రానికి లేఖ రాసిందన్నారు.

ఈ వాస్తవాన్ని దాచిపెట్టి అదానీతో వైఎస్‌ జగన్‌ రహస్య ఒప్పందం అంటూ టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. సెకీకి, అదానికి మధ్య జరిగిన వ్యవహారాన్ని జగన్‌పై నెట్టేస్తున్నారని అన్నారు. అప్పట్లో కాంగ్రెస్‌తో కుమ్మక్కై జగన్‌ను జైల్లో పెట్టించారని, మళ్లీ ఇప్పు­డు అవే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. 2014–19 మధ్య యూనిట్‌ రూ.6.90 చంద్ర­బాబు కొన్నారని, కానీ వైఎస్‌ జగన్‌ రూ.2.49కే సెకీతో ఒప్పందం చేసుకున్నారని వివరించారు. విద్యుత్‌ పంపిణీ వ్యవస్థను నాశనం చేసింది చంద్ర­బాబేనని చెప్పారు. బాబు హయాంలో రూ.8,848 కోట్లు బకాయిలు పెట్టి విద్యుత్‌ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టేశార­న్నారు. ఈనాడు వార్తలన్నీ టీడీపీ ఆఫీసు నుంచే వస్తున్నట్టు­న్నాయని చెప్పారు. వైఎస్‌ జగన్‌ వల్లే మంత్రి అయిన బాలినేని నేడు చంద్రబాబు, పవన్‌ మెప్పు కోసం అబద్ధాలాడుతు­న్నారని చెప్పారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)