Breaking News

పోలీసుల పరిస్థితే ఇలా వుంటే సామాన్య ప్రజల సంగతేంటి?

Published on Tue, 08/26/2025 - 13:50

సాక్షి, నెల్లూరు: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడుపై పోలీసులకు ఫిర్యాదు వెళ్లింది. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ మంగళవారం వేదాయపాళెం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి అయ్యన్నపై పిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. 

‘‘అయ్యన్నపాత్రుడు అనకాపల్లి, దొండపూడి గ్రామంలో ఓ సిఐ, ఎసైను నోటికి వచ్చినట్లు మాట్లాడారు. ఎస్స్కార్ట్ ఆలస్యంపై పరుషపదజాలం ఉపయోగించడం సిగ్గుచేటు. రాజ్యాంగ వ్యవస్థలో ఉన్నత స్థానంలో వున్న వ్యక్తి మాట్లాడాల్సిన మాటలు కావవి. అయ్యన్నపాత్రుడి వ్యాఖ్యలపై పోలీస్ అసోసియేషన్ స్పందించకపోవడం బాధాకరం.. 

.. మా పార్టీకి, నాయకులకు పోలీసులపై గౌరవ మర్యాదలు వున్నాయి. సభ్యసమాజం తల దించుకునేలా వుంది అయ్యన్నపాత్రుని తీరు. పోలీసుల పరిస్థితే ఇలా వుంటే సామాన్య ప్రజల సంగతి ఏంటి అని ఆలోచించాలి’’ అని అన్నారు. 

అయ్య‌న్న  సొంత జిల్లా అన‌కాప‌ల్లి జిల్లా దొండ‌పూడిలో గ్రామ దేవత సంబ‌రాలు ఆదివారం ప్రారంభ‌మయ్యాయి. మూడు రోజుల పాటు సాగే ఈ ఉత్స‌వాల‌ను.. స్పీక‌ర్‌ అయ్య‌న్న ప్రారంభించేందుకు వ‌చ్చారు. అయితే.. ఆయ‌న‌ను చూడ‌గానే పెద్ద ఎత్తున ప్ర‌జ‌లు గుమిగూడారు. ఈ సందులో త‌న‌పై దాడి జ‌రిగితే ఏంటి? అనేది అయ్య‌న్న ఆవేద‌న. దీంతో పోలీసుల‌పై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.  

తమాషాలు చేస్తున్నారా?. మేం వస్తుంటే సీఐ,ఎస్సై ఏం చేస్తున్నారు? క‌నీసం ప్రొటోకాల్ కూడా తెలియ‌క‌పోతే మీకు ఉద్యోగాలు ఎందుకు? ఈ సంగతి అసెంబ్లీలోనే తేలుస్తా అంటూ పోలీసులను బండబూతులు తిట్టారాయన. ఈ వ్య‌వ‌హారం సోష‌ల్ మీడియాలో ర‌చ్చ‌కు దారితీసింది. పోలీసుల‌ను తిట్టారంటూ.. అయ్య‌న్న‌పై పలువురు మండిపడుతున్నారు. దీంతో సీఎంవో, డీజీపీ కార్యాలయం అస‌లు ఏం జ‌రిగిందో వివ‌ర‌ణ ఇవ్వాల‌ని డీఎస్పీని ఆదేశించారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)