Breaking News

సెంచరీ కూడా కొట్టలేదు.. కాంగ్రెస్‌పై సింధియా సెటైర్లు..

Published on Tue, 06/25/2024 - 09:13

ఢిల్లీ: పార్లమెంట్‌ సమావేశాల మొదటి రోజు (సోమవారం) ఎన్డీయే  ప్రభుత్వం రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘిస్తూ.. బీజేపీ ఎంపీ భర్తృహరి మహతాబ్‌ను ప్రోటెం స్పీకర్‌గా ఎంపీక చేయటంపై కాంగ్రెస్‌ నేతృత్వంలోని ‘ఇండియా కూటమి’ ఎంపీలు నిరసన తెలిపారు. అయితే దీనిపై కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు.

‘‘ పార్లమెంట్‌ సమావేశాల తొలిరోజే కాంగ్రెస్‌ పార్టీ అనవసరంగా హడావుడి చేస్తోంది. కేవలం సొంతంగా 99 సీట్లు గెలిచినందుకే  ఇలా  చేస్తోంది. ఇప్పటివరకు మూడు సార్వత్రిక ఎన్నికల్లో  కాంగ్రెస్‌  గెలిచిన అన్ని సీట్లు కలిపినా.. 2014లో బీజేపీ సాధించిన సీట్ల కంటే కూడా తక్కువ. అంటే కాంగ్రెస్‌ మూడు ఎన్నికల్లో సైతం 240 సీట్లు కూడా  గెలవలేకపోతోంది’ అని సింధియా ఎద్దేవా చేశారు. (కాంగ్రెస్‌ పార్టీ 2014-56 సీట్లు, 2019-42 సీట్లు, 20124-99 సీట్లు గెలుచుకుంది). 

నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టి ఒక బెంచ్‌ మార్క్‌ సెట్‌ చేశారని సింధియా అన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో అంతర్జాతీయంగా భారత్‌ ఎదుగుతుందనే పూర్తి విశ్వాసం ఉందని తెలిపారు. ఇక.. 2024 ఎన్నికల్లో బీజేపీ 240  స్థానాలు గెలుపొందింది. అయితే మ్యాజిక్‌ ఫిగర్‌ సాధించకపోవటంతో మిత్రపక్షాల మద్దతుతో బీజేపీ.. ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

అదే విధంగా కాంగ్రెస్‌ పార్టీ 99 సీట్లు సాధించగా.. ఇండియా కూటమి 234 సీట్లకే పరిమితమైంది. సోమవారం పార్లమెంట్‌ సమావేశాల తొలి రోజు ‘ఇండియా కూటమి’ ఎంపీలు.. నీట్‌ యూజీ-2024 పరీక్ష పేపర్‌ లీక్‌, ప్రోటెం స్పీకర్‌ ఎంపీక, పార్లమెంట్‌లోని విగ్రహాలను మరోచోటుకు తరలించటం వంటి అంశాలపై ఎన్డీయే ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజ్యాంగం బుక్‌తో నిరసన తెలిపారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)