Breaking News

ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన జూపల్లి, కూచుకుల్ల తనయుడు

Published on Thu, 08/03/2023 - 10:40

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో కాంగ్రెస్‌ పార్టీ దూకుడు పెంచింది. ఇప్పటికే పలువురు బీఆర్‌ఎస్‌ నేతలు పార్టీలో చేరగా తాజాగా మరికొంతమంది హస్తం గూటికి చేరారు.

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి, టిఆర్ఎస్ ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి తనయుడు కూచుకుల్ల రాజేష్ రెడ్డి, ఎంపీపి మేఘా రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. చేరికల కార్యక్రమానికి రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మానిక్ రావు థాక్రే హాజరయ్యారు. 
(బీజేపీ హైకమాండ్‌ కీలక నిర్ణయం! తెలంగాణ ముఖ్య నేతలంతా అసెంబ్లీకే! ఎంపీలు కూడా)

వాయిదాలతో డౌట్‌!
కొంతకాలంగా జూపల్లి బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం జరిగిన నేపథ్యంలో కొన్ని ఆసక్తికర విషయాలు బయటికొచ్చాయి. కొల్లాపూర్‌ ఎమ్మెల్యే టికెట్‌తో పాటు ఆయన మరికొన్ని టికెట్లు ఆశిస్తున్నట్టు, దాన్నినాగం జనార్దన్‌రెడ్డి, జగదీశ్వర్‌రావు తీవ్రంగా వ్యతిరేకించినట్టు వార్తలొచ్చాయి.

పార్టీలో జూపల్లి చేరిక కూడా వాయిదాలు పడుతూ వచ్చింది. ఈక్రమంలోనే ఆయన కాంగ్రెస్‌లో చేరతారా? లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. ఎట్టకేలకు ఆ ప్రచారాలకు ఫుల్‌స్టాప్‌ పెడుతూ ఆయన చేతిలో చెయ్యేసి నడిచేందుకు అడుగేశారు.
(చదవండి: కాంగ్రెస్‌లోకి వస్తూనే టికెట్ల పంచాయితీ పెట్టిన జూపల్లి! నాగం ఆగమాగం.. చేరికపై ట్విస్టయితే ఉండదుగా!)

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)