Breaking News

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక.. కాం‍గ్రెస్‌ అభ్యర్థి కన్ఫర్మ్‌!

Published on Wed, 07/30/2025 - 11:29

సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్‌  ఉప ఎన్నిక అభ్యర్థి విషయంలో కాంగ్రెస్‌ పార్టీ దాదాపుగా ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఎవరికి వారే అభ్యర్థినంటూ ప్రకటించుకోవద్దంటూ గతంలో సీఎం రేవంత్‌ రెడ్డి సున్నితంగా మందలించిన సంగతి తెలిసిందే. మరోవైపు.. మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్‌ కూడా టికెట్‌ను పార్టీ లోకల్‌ వ్యక్తికే ఇస్తుందని అన్నారు. ఈ తరుణంలో.. 

గతంలో ఇదే స్థానం నుంచి పోటీ చేసిన ఓడిన మహ్మద్ అజహారుద్దీన్, పీజేఆర్‌ కూతురు విజయారెడ్డి, రేవంత్‌కు సన్నిహితుడైన రోహిన్‌రెడ్డిలతో పాటు నాంపల్లిలో పోటీ చేసి ఓడిన ఫిరోజ్ ఖాన్, బండి రమేష్, నవీన్ యాదవ్‌ల పేర్లు కాంగ్రెస్‌ నుంచి చర్చల్లోకి వచ్చాయి. అయితే..  

తాజాగా కాంగ్రెస్‌ మైనారిటీ ప్రతినిధులు పీసీసీ చీఫ్‌ మహేష్‌ గౌడ్‌ను కలిశారు. కేబినెట్‌లో మైనారిటీలకు ఎలాగూ ప్రాతినిధ్యం లేదని.. కనీసం ఈ ఉప ఎన్నిక టికెట్‌ని అయినా తమ వర్గానికి కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో అజారుద్దీన్‌ పేరును వాళ్లు బలపరిచినట్లు తెలుస్తోంది. 

ఈ విజ్ఞప్తిని పీసీసీ చీఫ్‌ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లగా.. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అజారుద్దీన్ వైపే అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఇదే విషయమై తెలంగాణ ఇంఛార్జి మీనాక్షి నటరాజన్‌, పీసీసీ చీఫ్‌ మహేష్‌ గౌడ్‌లు సీఎం రేవంత్‌తో చర్చిస్తున్నారు.

బీఆర్‌ఎస్‌ తరఫున నెగ్గిన మాగంటి గోపినాథ్‌ మృతితో జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక అనివార్యమైంది. డిసెంబర్‌లోపు ఎన్నికల సంఘం ఈ ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ బలాన్ని చూపించేందుకు ఇది ఓ అవకాశంగా భావిస్తున్నారాయన.

ఇదీ చదవండి: హెచ్‌సీఏ కంటే జూబ్లీహిల్స్‌ బైఎలక్షనే నాకు ముఖ్యం

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)