Breaking News

‘పొత్తులు లేకుండా ఎన్నికలకు వెళ్లలేని పిరికిపంద చంద్రబాబు’

Published on Mon, 05/29/2023 - 13:48

సాక్షి, తాడేపల్లి: మేనిఫెస్టోనే మాయం చేసిన ఘనుడు చంద్రబాబు. ఆయన చరిత్రే నకిలీ చరిత్ర అంటూ మంత్రి జోగి రమేష్‌ సీరియస్‌ కామెంట్స్‌ చేశారు. ఆల్‌ కాపీ బాబు.. నకిలీ బాబుకు 2024లోనూ పరాభవం తప్పదు. పొత్తులు లేకుండా ఎన్నికలకు వెళ్లలేని పిరికిపంద చంద్రబాబు అంటూ ఎద్దేవా చేశారు. 

కాగా, మంత్రి జోగి రమేష్‌ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘డర్టీ బాబు.. టిష్యూ మేనిఫెస్టో. 2014 ఎన్నికల్లో 650 వాగ్దానాలు చేసి గాలికొదిలేశాడు. 650 వాగ్దానాల్లో 10 హామీలైనా నెరవేర్చలేదు. మేనిఫెస్టోను మాయం చేసిన ఘనుడు చంద్రబాబు. 14 ఏళ్లు అధికారంలో ఉండి చంద్రబాబు చేయలేని అభివృద్ధిని కేవలం నాలుగేళ్లలోనే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేసి చూపించారు. వచ్చే ఎన్నికల్లోనూ సింగిల్‌గానే పోటీ చేస్తాం. పొత్తులు లేకుండా ఎన్నికలకు వెళ్లలేని పిరికిపంద చంద్రబాబు. 

14 ఏళ్లు సీఎంగా ఉన్నప్పుడు నిరుద్యోగ భృతి ఏమైంది?. 14 ఏళ్ళలో ఉచిత బస్సు ప్రయాణం ఎందుకివ్వలేదు?. రుణమాఫీ అంటూ చంద్రబాబు రైతులను మోసం చేశాడు. 2024 ఎన్నికల్లోనూ చంద్రబాబును బీసీలు తరిమితరిమి కొడతారు. పేదల రక్తాన్ని పీల్చిపిప్పిచేసిన దుర్మార్గుడు చంద్రబాబు. ఆయన వేషాలను ప్రజలు గమనిస్తున్నారు. 2024 ఎన్నికల తర్వాత టీడీపీ అడ్రస్‌ గల్లంతే. చంద్రబాబు ఇక హైదరాబాద్ లేక సింగపూర్‌లో వెళ్ళిపోవడం ఖాయం. 

కేబినెట్‌లో ఒక్క బీసీకైనా చంద్రబాబు ప్రాధాన్యత ఇచ్చాడా?. కానీ, సీఎం జగన్‌ కేబినెట్‌లో సామాజిక న్యాయం చేశారు. సీఎం జగన్‌ మాట చెప్పాడంటే.. చేస్తాడంతే. పేదలను సంపన్నులుగా చేయగలిగే వ్యక్తి సీఎం జగన్‌. అన్ని రంగాల్లో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సీఎం జగన్. ముఖ్యమంత్రి జగన్‌ గురించే మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు. పేదలకు ఇళ్ల స్థలం ఇస్తుంటే కోర్టులకెళ్లి అడ్డుకున్నావు. ఇప్పుడు పేదల ఆదాయం రెట్టింపు చేస్తానంటున్నాడు. మేనిఫెస్టో అంటే బాధ్యత ఉండాలి. ఒక మాట ఇస్తే దాని కోసం ఎంతవరకైనా పోరాడాలి. ఈ క్రమంలోనే మహానాడులో ప్రవేశపెట్టిన టీడీపీ మేనిఫెస్టోను చించేసి చెత్త బుట్టలో పడేశారు. 

ఇది కూడా చదవండి: బాలకృష్ణ ఫొటో ఎందుకు పెట్టలేదు.. కొడాలి నాని సీరియస్‌

Videos

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)