Breaking News

ఆస్తుల అమ్మకం.. పవన్‌ సరికొత్త నాటకం 

Published on Wed, 02/28/2024 - 14:20

తెలుగుదేశం, జనసేన కూటమి సీట్ల పంపిణీ అంశం బయటపడగానే ఇరుపార్టీల్లో అసమ్మతి గుప్పుమన్నది. తెలుగుదేశంలో కాస్త తక్కువ మోతాదులోనే అసమ్మతి వ్యక్తం అయినా, జనసేనలో మాత్రం తీవ్రత ఎక్కువే ఉంది. కేవలం పాతికలోపు సీట్ల కోసమా ఇన్నాళ్లూ ఎదురుచూసింది.. దానికోసం మేమెందుకు టీడీపీ జెండాలు మోయాలి.. మేము సహకరించేది లేదు అనే అసంతృప్తి జనసైనికులు, కాపు సంఘాల్లో వ్యక్తమవుతోంది. దీంతో కేడర్‌లో వెల్లువెత్తిన ఈ అసంతృప్తిని, ఆగ్రహాన్ని చల్లార్చేందుకు పవన్ కళ్యాణ్ సరికొత్త డ్రామాకు తెరతీసినట్లు తెలుస్తోంది. 

అందుకే తాను కష్టాల్లో ఉన్నానని, పేదరికంతో బాధపడుతూనే ప్రజలకోసం పార్టీని నడుపుతున్నాను అని చెప్పుకునేందుకు సరికొత్త డ్రామాకు తెరతీసినట్లు చెబుతున్నారు. కేవలం చంద్రబాబు వద్ద ప్యాకేజీ తీసుకుని అతి తక్కువ సీట్లకు చంద్రబాబుకు జనసేనను తాకట్టు పెట్టేశారన్న అపవాదును, ఆరోపణలకు తప్పించుకునేందుకు పవన్ కొత్త ఎత్తులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన తన ఆస్తులు అమ్ముతున్నట్లు ఒక ప్రకటన చేశారు. 

జీరో బడ్జట్ పాలిటిక్స్ చేస్తాను అని, తరచూ చెప్పే పవన్‌ ఇప్పుడు ఆస్తులు ఎందుకు అమ్ముతున్నారు?. ఇంతా చూస్తే ఆయన అభ్యర్థుల దగ్గరే డబ్బు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దానికితోడు నాగబాబు అయితే ఏకంగా క్యూఆర్ కోడ్ పెట్టి మరీ విరాళాలు వసూళ్లు చేస్తున్నారు. అలాంటి తరుణంలో పవన్ ఆస్తులు అమ్ముతున్నట్లు ఎందుకు ప్రకటన చేశారు. ఎందుకంటే పాపం పవన్ డబ్బుల్లేక ఇబ్బందుల్లో ఉన్నారు. ఆస్తులు అమ్మితే తప్ప పార్టీ నడవదు. ఇంకా ఆయనకు చంద్రబాబు సైతం ప్యాకేజీ ఇవ్వడం లేదు అందుకే పాపం ఆస్తులు అమ్ముకుని మరీ పార్టీని నడుపుతున్నారు అని కేడర్‌ అనుకోవాలన్నది ఆయన ఎత్తుగడ అంటున్నారు. 

గత ఎన్నికల్లో 2019లో వందకు పైగా నియోజకవర్గాల్లో పోటీ చేసినప్పుడు కూడా ఎక్కడా సెంటు భూమి అమ్మని పవన్ ఇప్పుడు కేవలం పాతిక సీట్లల్లో పోటీ చేస్తూ ఆస్తులు అమ్ముతున్నట్లు ఎందుకు ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే కేవలం జనసేన కేడర్‌ను చల్లబరిచేందుకు.. వారిలో కోపానికి లేపనం పూసేందుకు మాత్రమే అలాంటి పుకార్లు వదులుతున్నట్లు చెబుతున్నారు. సినిమాల్లో ట్రిక్స్చూపించడం ద్వారా ప్రేక్షకులు, అభిమానులను ఆకట్టుకున్న రీతిలోనే ఇప్పుడు పాలిటిక్స్‌లో సైతం ఇలాంటి మ్యాజిక్కులు చేసి ప్రజలను, కాపు సంఘాలను నమ్మించేందుకు ఆయన ఇలాంటి బీద ఏడుపులు ఏడుస్తున్నారని అంటున్నారు. ఎన్ని గ్లిజరిన్ ఏడుపులు ఏడ్చినా ఈసారి కేడర్‌ నమ్మేది లేదని బుద్ధి చెప్పడం ఖాయమని అంటున్నారు.

- సిమ్మాదిరప్పన్న

Videos

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)