Breaking News

పవన్‌ ఢిల్లీ డ్రామా.. జనసేనలో నైరాశ్యం!

Published on Tue, 02/20/2024 - 10:16

సాక్షి, ఎన్టీఆర్‌: టీడీపీ-జనసేన పొత్తులపై ఇప్పటికీ అయోమయం కొనసాగుతోంది. ఎన్నికలకు పట్టుమని 60 రోజులు కూడా లేదు. అయినా ఇంకా టిక్కెట్లు ఖరారు కాలేదు. ఈ తరుణంలో కేడర్‌ చేజారిపోకుండా ఉండేందుకు ఎన్ని డ్రామాలు ఆడాలో.. అన్నీ ఆడేస్తున్నారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌. అందుకే మరోసారి తెరపైకి పవన్ ఢిల్లీ పర్యటన తీసుకొచ్చారు. 

‘రెండ్రోజుల్లో ఢిల్లీ వెళ్తా..’  జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తన పర్యటన గురించి జనసేన అధికారిక సమాచారం ఇచ్చింది కాదు. విశాఖ జిల్లా జనసేన కార్యకర్తలతో చర్చల సందర్భంగా కార్యకర్తలతో పవన్‌ చేసిన వ్యాఖ్యలివి. ఆ వ్యాఖ్యలే మీడియాకు లీకయ్యాయి. అయితే ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిన వ్యవహారంగానే అర్థమవుతోంది. 

టీడీపీతో పొత్తు ప్రకటించిన పవన్‌ కల్యాణ్‌.. ఆ తర్వాత చంద్రబాబుతో పలు దఫాలుగా చర్చలు జరిపినా సీట్ల పంపకంపై ఎటూ తేల్చలేకపోయారు. ఓవైపు టీడీపీ ఏమో ఏకపక్షంగా పలు స్థానాల్లో అభ్యర్థుల్ని ప్రకటించుకుంటూ పోతోంది. మరోవైపు టీడీపీ నేతలు పవన్‌ను కలిసి తమ స్థానాల వైపు రావొద్దంటూ కోరుతున్నారు. ఇంకోవైపు.. జనసేన ఆశిస్తున్న స్థానాల్లోనూ టీడీపీ(అదనంగా అందులో వర్గపోరు కూడా) ముందుకొస్తోంది. ఈ తరుణంలో.. బాబు-పవన్‌లు వెనువెనుకే ఢిల్లీ పర్యటనలకు వెళ్లారు. అక్కడ బీజేపీ పెద్దలతో చర్చలు జరిపారు. కానీ.. 

ఫలితం లేనట్లు కనిపిస్తోంది. అందుకే ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు. ఆ తర్వాతే ఇరు పార్టీల ఉమ్మడి సమావేశాలు రద్దు అయ్యాయి. పవన్‌ తన టూర్లు రద్దు చేసుకుని.. మంగళగిరి ఆఫీస్‌కే పరిమితం అయ్యారు. ఇప్పుడు ‘‘వ్యక్తిగత గెలుపు కోసం కాదు.. సమష్టి గెలుపు కోసమే తన వ్యూహాలు, అడుగులు ఉంటాయి. జనసేన కోసం తపించి పనిచేసిన ప్రతి ఒక్కరికీ సముచిత గౌరవం కల్పించే బాధ్యత నాది’’ అంటూ త్యాగాలకి సిద్దం కావాలనే అర్థం వచ్చేలా పవన్‌ చేసిన వ్యాఖ్యలతో జనసేన నేతల్లో నైరాశ్యం పెరిగిపోతోంది. అందుకే ఢిల్లీ పర్యటన అని చెప్పినా.. పెదవి విరిచేస్తున్నారు. 

పవన్‌ వ్యాఖ్యలతో..  టీడీపీలో కలకలం
టీడీపీతో కలవడం బీజేపీకి ఎంత మాత్రం ఇష్టం లేదు. నేనే ఒప్పించా.. అని కార్యకర్తలతో పవన్ చేసిన వ్యాఖ్యలు పొత్తు రాజకీయంపై ప్రభావం చూపేలా కనిపిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలతో టీడీపీలో ఒక్కసారిగా కలకలం రేగింది. దీంతో టీడీపీ కేడర్‌ నొచ్చుకుంది. ఈ క్రమంలోనే.. సోమవారం రాత్రి రాజమండ్రి ఎయిర్‌పోర్ట్‌లో కనీసం పవన్‌కు ఆహ్వానం పలికేందుకు కూడా టీడీపీ నేతలు రాలేదని స్పష్టమవుతోంది. 

గత నెలలోనూ ఇదే విధంగా లీకులు
పవన్‌ ఢిల్లీ ఎపిసోడ్‌లో కొసమెరుపు ఏంటంటే.. ఇప్పటివరకు ఆయనకు బీజేపీ పెద్దల అపాయింట్ మెంట్ దొరక్కపోవడం!. ఇవాళో, రేపో అపాయింట్‌మెంట్‌ ఖరారు అవుతుందని జనసేన వర్గాలు చెబుతున్నప్పటికీ.. ఆ పరిస్థితులు మాత్రం కనిపించడం లేదు. అయితే.. గత నెలలోనూ ఇదే విధంగా పవన్‌ ఢిల్లీ పర్యటనకు సంబంధించి లీకులు ఇచ్చాడు. అప్పుడూ ఇదే తరహాలో అపాయింట్‌మెంట్‌ దొరకలేదు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)