Breaking News

‘బీజేపీతో దోస్తీ కన్నా.. సీఎం పదవి వదిలేయడం నయం’

Published on Wed, 10/01/2025 - 07:25

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌ సీఎం ఒమర్‌ అబ్దుల్లా.. బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో దోస్తి కట్టడం కంటే.. ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవటమే తనకు ఇష్టమని స్పష్టంచేశారు. తన ప్రభుత్వంలోకి బీజేపీని భాగస్వామిగా చేర్చుకుంటే.. జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కానీ ఆ పని చేయటం తనకు ఇష్టం లేదని ఒమర్‌ అబ్దుల్లా చెప్పుకొచ్చారు.

అనంత్‌నాగ్‌ జిల్లాలోని అచబల్‌లో మంగళవారం ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. ‘మీరు (ప్రజలను ఉద్దేశించి) సిద్ధమైతే చెప్పండి.. ఈ వ్యాపారం (బీజేపీతో పొత్తు) చేయటం నాకు ఇష్టంలేదు. బీజేపీని ప్రభుత్వంలోకి తీసుకోవటం అవసరమని మీరు అనుకుంటే ముందు నా రాజీనామాను ఆమోదించండి. మరో ఎమ్మెల్యే సీఎం అయ్యి ప్రభుత్వాన్ని నడిపిస్తారు. బీజేపీతో పొత్తుకు నేను మాత్రం సిద్ధంగా లేను. మన ప్రభుత్వంలోకి బీజేపీని తీసుకొంటే మనకు ఒక బహుమతి లభించవచ్చు. వాళ్లు (కేంద్రం) మనకు త్వరలోనే రాష్ట్ర హోదా ప్రకటించవచ్చు’ అని పేర్కొన్నారు.

ప్రభుత్వంలో కశ్మీర్‌కు మాత్రమే ప్రాతినిధ్యం ఉందన్న వాదనను ఒమర్‌ అబ్దుల్లా తిరస్కరించారు. ‘ప్రభుత్వంలో పిర్‌పంజాల్‌కు ప్రాతినిధ్యం ఉంది. దిగువ జమ్ము ప్రాంతానికి కూడా ప్రాతినిధ్యం ఉంది. జమ్మూ నుంచి ఉపముఖ్యమంత్రి ఉన్నారు’ అని తెలిపారు. జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను శాంతియుత, ప్రజాస్వామ్యయుత పోరాటాలతోనే సాధించుకుంటామని స్పష్టంచేశారు.   
 

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)