Breaking News

క్షమాపణ చెప్పాల్సిందే, లేకుంటే రాష్ట్రంలో తిరగనివ్వం: ఎమ్మెల్సీ కవిత

Published on Wed, 07/12/2023 - 12:03

సాక్షి, హైదరాబాద్‌:బీఆర్‌ఎస్‌ పార్టీ అందిస్తున్న ఉచిత కరెంట్‌పై తెలంగాణ పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యల కారణంగా అటు రైతులతో పాటు బీఆర్‌ఎస్‌ నాయకులు భగ్గుమంటున్నారు. హైదరాబాద్‌ విద్యుత్‌ సౌధ వద్ద బుధవారం నిర్వహించిన ధర్నాలో బీఆర్‌ఎస్‌ శ్రేణులతో కలిసి ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే దానం నాగేందర్‌ తదితరులు పాల్గొని నిరసన తెలియజేశారు. రేవంత్‌ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి వ్యాఖ్యాలపై మండిపడ్డారు.

రైతుకు వ్యవసాయం పండగ కావాలంటే నీళ్ళు, రైతు బంధు ఇస్తున్నామని.. వ్యాపార వేత్తలకు కరెంట్ ఇవ్వొదని రేవంత్ రెడ్డి చెప్పడం సమజసం కాదని ఫైర్‌ అయ్యారు.  కాంగ్రెస్ నేతలు ఉచిత కరెంట్పై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేసిఆర్ పాన లో వ్యవసాయం పండగ అయ్యిందని.. 24 గంటల కరెంటు కచ్చితంగా ఇచ్చి తీరుతామని స్పష్టం చేశారు.

గ్రామంలో కాంగ్రెస్ నాయకులను తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. బేశరుతుగా కాంగ్రెస్ నాయకులు క్షమాపణ చెప్పాలని, లేకుంటే తెలంగాణలో తిరగనివ్వమని వార్నింగ్‌ ఇచ్చారు. కాగా తెలంగాణ రైతాంగానికి మొత్తానికి ఎనిమిది గంటల ఉచిత విద్యుత్‌ ఇస్తే సరిపోతుందని, 24 గంటల ఉచిత విద్యుత్‌ మాత్రం విద్యుత్‌ సంస్థల నుంచి కమీషన్ల కోసమేనంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో రాజకీయంగా వేడిని రాజేశాయి.

చదవండి: రేవంత్‌ ‘ఉచిత’ ఉపన్యాసం.. ఆత్మరక్షణలో కాంగ్రెస్‌.. చేజేతులా!

Videos

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)