Breaking News

Human Rights: నోరు తెరవొద్దు.. పోస్టులు పెట్టొద్దు!

Published on Mon, 12/09/2024 - 16:04

ప్రపంచమంతా మానవ హక్కుల దినోత్సవం నిర్వహించుకుంటున్న వేళ(డిసెంబర్‌ 10న).. ఏపీలో మాత్రం ఆ హక్కులు ఊసేలేకుండా పోతున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నంతకాలం పెంచుకున్న పగను.. అధికారంలోకి రాగానే వెల్లగక్కడం మొదలుపెట్టారు నారా చంద్రబాబు నాయుడు. ఈ క్రమంలోనే రాష్ట్ర శాంతిభద్రతలను పూర్తిగా గాలికి వదిలేశారు. ఫలితంగానే.. గత ఆరు నెలలుగా దాడులు, హత్యలు, అత్యాచారాలకు నిలయంగా మారింది. భద్రత కరువైన వేళ బతుకుజీవుడా అనుకుంటూ కొందరు ఏపీని విడిచి వెళ్లిపోతుండగా.. ప్రభుత్వ వేధింపులు భరించలేక మరికొందరు బలవనర్మరణాలకు పాల్పడ్డారు.

ఏపీలో ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుక్షణం నుంచే మానవ హక్కుల ఉల్లంఘన యధేచ్ఛగా కొనసాగుతోంది. వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులను సైతం వదలకుండా దాడులకు తమ శ్రేణులను ఉసిగొల్పింది కూటమి.  ఇక.. పూర్తిస్థాయిలో ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాక.. ఆ దౌర్జన్యాలు పెచ్చుమీరాయి. ప్రతిపక్ష నేతలూ, కార్యకర్తల మీద ఏపీ పోలీసులూ.. కూటమి వర్గాల దాష్టీకాలు అన్నీఇన్నీ కావు. దళితులపైనా దారుణమైన దాడులు జరుగుతున్నాయి. విపక్ష నాయకుల నిరసనలపై ఖాకీల ఆంక్షలు సరేసరి.

‘ఒక మనిషి స్వేచ్ఛగా, గౌరవంగా బతకడానికి కొన్ని హక్కులు అవసరం. జాతి, కుల, మత, వర్ణ, లింగ, రాజకీయపరమైన వివక్షకు గురవ్వకుండా వ్యక్తుల రక్షణ కోసం రూపొందించినవే మానవ హక్కులు. ఆ హక్కులపై ప్రజలకు పూర్తిస్థాయి అవగాహన కల్పించడం ప్రభుత్వాల బాధ్యత. అలాంటి ప్రభుత్వమే ఏపీలో ఆ బాధ్యత మరిచి.. హక్కులను కాలరాస్తోంది’

అధికారం చేపట్టాక.. పవన్‌ కల్యాణ్‌ ప్రతీకార రాజకీయాల్లాంటివి ఉండబోవని ప్రకటించారు. కానీ, స్వయానా సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్‌ రెడ్‌బుక్‌ పేరిట ఇష్టారాజ్యానికి దిగారు. ఆ ఎర్రబుక్‌లో ఉన్నవాళ్లను అధికార దుర్వినియోగంతో హింసిస్తున్నారు.  తమ అనుకూలురను ప్రొత్సహించే క్రమంలో ఇతరులను బదిలీలు చేయించారు. మాట విననివాళ్లను బలవంతంగా ఇళ్లకు పంపించారు. ఈ పరిణామాలకు భయపడే అధికారులు కళ్లు మూసుకుండిపోయారు.

ఇదీ చదవండి: చంద్రబాబు ఆటవిక పాలనపై జాతీయ పార్టీల ఆగ్రహం

ఏవో కొంపలు మునిగిపోయినట్లే!
నచ్చని అంశాలను విమర్శించడం.. ప్రజలకున్న హక్కు. ఆ హక్కు ఎంతంగా వినియోగంలో ఉంటే.. ప్రజాస్వామ్యం అంతగా బలోపేతమవుతుంది. అయితే ఏపీలో రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛకు ఏపీలో తూట్లు పొడుస్తున్నారు. ఎన్నికల హామీల గురించి, ప్రజా సమస్యలపై మాట్లాడిన వాళ్లపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. 

సాధారణంగా.. సోషల్‌ మీడియాలో ఎవరైనా పోస్టులు చేయడం సహజం. కానీ,​ కూటమి ప్రభుత్వ కర్కోటక ఏలుబడిలో మాత్రం అది మహాపాపం. సామాజిక మాధ్యమాల్లో ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టు పెడితే- ఏవో కొంపలు మునిగిపోయినట్టు కేసులు పెడుతున్నారు. రాజకీయ ఆసక్తితో పోస్టులు చేస్తున్నవాళ్లనూ వదలడం లేదు. అక్రమ కేసులు బనాయిస్తూ.. స్టేషన్ల చుట్టూ తిప్పుతూ.. చిత్రహింసలకు గురి చేస్తున్నారు. ఆఖరికి.. ఆడపడుచుల విషయంలోనూ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో రాజకీయ బ్లాక్‌మెయిల్‌కు తలొగ్గుతున్న వాళ్లు కొందరైతే.. ధైర్యంగా పోరాడుతున్నవాళ్లు మరికొందరు.

ఇదీ చదవండి: టీడీపీ వేధింపులతో వైఎస్సార్‌సీపీ నేత ఆత్మహత్య

అన్నింటిని మేనేజ్‌ చేస్తున్న బాబు!
దేశంలో ఎక్కడా లేనంతగా.. చంద్రబాబు సారథ్యంలో ఏపీలో పౌరహక్కుల హననం నిరాటంకంగా సాగుతోంది. ఈ ఆర్నెల్ల కాలంలోనే ఏపీ నుంచి జాతీయ, రాష్ట్ర మానవ హక్కుల సంఘాలకు రికార్డు స్థాయిలో ఫిర్యాదులు వెళ్లాయి. కేంద్ర పెద్దలకు, గవర్నర్‌ స్థాయి వాళ్లకు స్వయంగా ఫిర్యాదులు అందజేసింది వైఎస్సార్‌సీపీ. ఇక.. పోలీస్‌ శాఖకు వెళ్లిన ఫిర్యాదుల సంగతి సరేసరి. అయినా తన పరపతిని ఉపయోగించి చంద్రబాబు ఎక్కడికక్కడే వ్యవస్థలను మేనేజ్‌ చేసుకుంటూ పోతున్నారు.

రాజ్యాంగ నిర్దేశాలను నట్టేట్లో కలుపుతున్న కూటమి ప్రభుత్వం- మానవ హక్కుల హంతకిగా మారింది. ఏపీలో భయోత్పాతాన్ని సృష్టిస్తూ తాను ఆడిందే ఆటగా చెలరేగిపోతోంది. ఏపీలో ప్రజాస్వామ్యాన్ని అధోపాతాళానికి దిగజార్చింది.  ఇప్పుడు ఏపీలో మానవహక్కులతో పాటు ప్రజాస్వామ్య పరిరక్షణకు మిగిలింది హక్కుల కమిషన్ల, న్యాయస్థానాల జోక్యం మాత్రమే!.

హాస్టల్ పై దాడి యజమానితో కాళ్లు పట్టించుకున్న కూటమి నేతలు

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)