Breaking News

ఓటమి భయం.. రంగంలోకి బాలకృష్ణ, వసుంధర!

Published on Thu, 10/29/2026 - 12:26

కొళాయిల్లో ఎప్పుడూ రాని నీళ్లు... మురుగుతో పొంగిపొర్లే కాల్వలు...కనీస సౌకర్యాలు కనిపించవు.. ప్రజల గోడు ఎవరికీ వినిపించదు. నాలుగు దశాబ్దాలుగా టీడీపీ నాయకులు ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురంలోని పరిస్థితి ఇది. బాలకృష్ణ మూడు పర్యాయాలు ఇక్కడి నుంచి అసెంబ్లీకి వెళ్లినా ఈ ప్రాంత అభివృద్ధిని మాత్రం పూర్తిగా విస్మరించారు. నిత్యం సినిమాల్లో బిజీగా ఉండే ఆయన.. పీఏలకు పాలన పగ్గాలు అప్పగించడంతో వారు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. ఫలితంగా జనం నరకం చూస్తున్నారు.  

హిందూపురం(చిలమత్తూరు): శ్రీసత్యసాయి జిల్లాలోనే అతిపెద్ద పట్టణంగా పేరుగాంచిన హిందూపురం మున్సిపాలిటీ పరిధి రోజు రోజుకూ విస్తరిస్తోంది. 52 వార్డులు...2.26 లక్షల జనాభా ఉన్న పట్టణం సమస్యల సుడిగుండంలో చిక్కుకుంది. అవినీతి, అక్రమాలకు నిలయంగా మారింది. స్థానికంగా ఎమ్మెల్యే బాలకృష్ణ ఉండకపోవడం, పీఏలకు     అధికారాలు ఇవ్వడంతో దోపిడీలు, దౌర్జన్యాలకు కేంద్ర బిందువుగా మారిపోయింది. ఎమ్మెల్యే బాలకృష్ణ చుట్టపుచూపుగా వచ్చిపోతుండటంతో ఇక్కడి నేతలు, కాంట్రాక్టర్లు, అధికారులు కుమ్మక్కై దోచుకుతింటున్నారని ప్రజలు మండిపడుతున్నారు. కనీసం తాగేందుకు నీళ్లు ఇవ్వలేని పాలకులపై జనం గుర్రుగా ఉండగా.. మున్సిపల్‌ ఎన్నికల్లో టీడీపీకి ఓటమి భయం పట్టుకుంది. ఈ నేపథ్యంలో బాలకృష్ణ సతీమణి వసుంధర హిందూపురంలో ప్రచారం నిర్వహిస్తుండగా... తాజాగా బాలకృష్ణ కూడా ప్రచారం కోసం రావడం చర్చనీయాంశమైంది. 

నీరు కరువు.. మురుగు పరుగు.. 
పట్టణంలో  తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. గొల్లపల్లి రిజర్వాయర్‌ నుంచి 10 రోజులకు ఒక్కసారి తాగునీరు సరఫరా చేస్తున్నారు. దీంతో ప్రజలు తమ అవసరాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేస్తున్నారు. వచ్చే అరకొర నీటికీ ట్యాక్స్‌లు మాత్రం భారీగా వసూలు చేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. ఇక మురుగు కాల్వలు సరిగా లేకపోవడంతో వర్షాలు వచ్చినప్పుడు మురుగునీరు ఇళ్లలోకి, దుకాణాల్లోకి చేరుతుండటంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మురుగునీరు కొట్నూరు, శ్రీకంఠపురం చెరువుల్లో చేరుతుండగా.. ఆ నీరంతా కలుషితమవుతోంది.  

అభివృద్ధి పనుల్లో భారీ దోపిడీ.. 
ఇక మున్సిపాలిటీ పరిధిలో రూ.92 కోట్లతో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో భారీగా అక్రమాలు జరిగాయి. ముఖ్యంగా ప్రధాన రోడ్లు, సీసీ రోడ్లు     వంటివి నాసిరకంగా నిర్మించి భారీగా దోచేశారనే ఆరోపణలున్నాయి. అలాగే హిందూపురం ప్రజల నీటి అవసరాలు తీర్చే రూ.136 కోట్ల గొల్లపల్లి వాటర్‌ ప్రాజెక్ట్‌ పనుల్లో అక్రమాలకు పాల్పడుతున్నారు. ఎమ్మెల్యే బాలకృష్ణ నివాసం సమీపంలోనే వాటర్‌ ట్యాంకు నిర్మాణ పనులు జరుగుతుండగా, నాసిరకం స్టీల్‌ వాడి ట్యాంకు నిర్మాణం చేస్తున్నారు. ఇక మున్సిపాలిటీ పరిధిలోని కొట్నూరు రెవెన్యూ పొలంలో టీడీపీ నేతలు సర్వే నంబర్‌ 259–1లో రూ.కోట్లు విలువ చేసే మున్సిపల్‌ స్థలాన్ని కబ్జా చేసి అక్రమంగా షెడ్లు నిర్మాణం చేపట్టి వాడుకుంటున్నారు.  

ఇదీ చదవండి: శ్రీలంక పౌరురాలికి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ టికెట్టా?

దారితప్పిన శాంతిభద్రతలు.. 
చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో కొలువుదీరిన తర్వాత  హిందూపురం అత్యాచారాలు, హత్యలు, దోపిడీలు అధికం కాగా, శాంతి భద్రతలు పూర్తిగా అదుపుతప్పాయి. కూటమి నేతల సేవలో పోలీసు యంత్రాంగం తరిస్తుండటంతో సామాన్య ప్రజానీకం నరకం  చూస్తున్నారు. నియోజకవర్గంలో వెలుగుచూసిన దొంగ నోట్ల వ్యవహారంలో టీడీపీ ముఖ్యనేత పాత్ర ఉండటం సంచలనం రేపింది. అయితే ఆ నోట్లను కూడా పోలీసులు టాయ్‌ నోట్లుగా చిత్రీకరించి దేశద్రోహం కేసు బదులు నామమాత్రపు కేసు పెట్టి మమ అనిపించారు. ఇక పట్టణంలో తాళాలు వేసిన ఇళ్లు, దుకాణాలను టార్గెట్‌ చేసిన దొంగలు.. వరుస చోరీలకు పాల్పడుతున్నారు.  అయినా ఇంతవరకూ వారిని పట్టుకున్న దాఖల్లాల్లేవు. 

నలుగురు.. నాలుగు దిక్కులు.. 
బాలకృష్ణ చుట్టం చూపుగా వచ్చి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి వెళ్లిపోతుంటారు. ఆయన పీఏలు నలుగురు ఉండగా, నలుగురు నాలుగు దిక్కులు గా ఏర్పడి స్వప్రయోజనాలపైనే దృష్టిపెట్టి పట్టణ అభివృద్ధిని, సౌకర్యాల కల్పనను గాలికి వదిలేశారు. ఇసుక, మట్టి అక్రమ రవాణాతో పాటు భూకబ్జాలు, సెటిల్‌మెంట్లు చేస్తూ భారీగా దోచేస్తున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే అధికారం అండతో తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు.  అందుకే వారి అవినీతి గురించి నోరు విప్పేందుకు కూడా ‘పురం’వాసులు భయపడిపోతున్నారు. 

లోటు బడ్జెట్‌లో మున్సిపాలిటీ.. 
హిందూపురం మున్సిపాలిటీకి ప్రాపర్టీ ట్యాక్స్‌ కేవలం రూ.16 కోట్లు మాత్రమే వస్తోంది. వచ్చిన ఆదాయంలో 80 శాతం గొల్లపల్లి నుంచి నీటి సరఫరాకే ఖర్చు చేస్తున్నారు. మిగిలిన మొత్తంతోనే అభివృద్ధి పనులు, సిబ్బందికి జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితి.  

జిల్లా సర్వజనాసుపత్రిలో సమస్యలు.. 
హిందూపురంలోని జిల్లా ఆస్పత్రికి నిత్యం వేలాది మంది వస్తుంటారు. కానీ ఇక్కడ రోగులకు కనీస సౌకర్యాలు కరువయ్యాయి.  2024 ఫిబ్రవరిలో క్రిటికల్‌ కేర్‌ బ్లాక్‌ నిర్మాణానికి వైఎస్సార్‌సీపీ హయాంలో శంకుస్థాపన చేశారు. గత నెలలో టీడీపీ ఆర్భాటంగా క్రిటికల్‌ కేర్‌ బ్లాక్‌ ప్రారంభించినప్పటికీ పూర్తి స్థాయిలో పరికరాలు, సిబ్బంది, వైద్యుల నియామకాన్ని చేపట్టలేదు.

ఓటమి భయంతోనే ప్రచారానికి బాలకృష్ణ 
హిందూపురంలో రెండున్నరేళ్లుగా అరాచకశక్తులు రాజ్యమేలుతున్నాయి. ఎమ్మెల్యే బాలకృష్ణ నియోజకవర్గంలో ఉండగానే వైఎస్సార్‌సీపీ కార్యాలయంపై టీడీపీ గూండాలు దాడి చేశారు. ప్రజాస్వామ్యంలో ఇంత దౌర్జన్యం ఎక్కడైనా ఉంటుందా..? అక్రమ మైనింగ్, ఇసుక, మట్టి మాఫియా పేట్రేగిపోతోంది. అభివృద్ధి మాటున టీడీపీ నేతలు జేబులు   నింపుకున్నారు. టీడీపీ నేతలకు ఓట్లు అడిగే అర్హతే లేదు. ప్రజల కనీస అవసరాలు తీర్చలేని టీడీపీ ఎన్నికల్లో ఓటమి చెందడం ఖాయం. అందుకే సినిమాలకే పరిమితమైన ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రచారానికి వస్తున్నారు.  
– టీఎన్‌ దీపిక, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త, హిందూపురం 

తాగునీటికీ కరువు 
మా ప్రాంతంలో పది రోజులకు ఒకసారి నీళ్లు వస్తాయి. రోజువారీ అవసరాలకు ఆ నీళ్లు సరిపోవడం లేదు. అందుకే ట్యాంకర్ల ద్వారా నీళ్లు కొంటున్నాం. డ్రైనేజీలు సరిగా లేకపోవడంతో దోమలు వ్యాప్తి అధికంగా ఉంది. వర్షాలు పడితే మరింత ఇబ్బందికరంగా     ఉంటుంది.  
– శారద, హిందూపురం   

రోడ్లపైనే మురుగు 
హిందూపురం మున్సిపాలిటీని అధ్వానంగా మార్చారు. అభివృద్ధి పనుల పేరుతో దోచుకుతిన్నారు. డ్రైన్లు లేక మురుగునీరు రోడ్లుపైనే ప్రవహిస్తోంది. మున్సిపల్‌ వర్కర్లు కొరత ఎక్కువగా ఉంది. ఉన్నవారితోనే ఎక్కువ పని చేయిస్తున్నారు. వర్షాలు వస్తే ఇళ్లలోకి, దుకాణాల్లోకి నీరు చేరుతుండటంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. 
– సురేష్‌ కుమార్, రైల్వే రోడ్డు, హిందూపురం   

 

Videos

నగరిలో దుమ్మురేపిన రోజా ఎన్నికల ప్రచారంలో

జార్ఖండ్ ను అంటుకున్న అర్నబ్ తుఫాన్

DIWALI GIFT! ఒక రోజు ముందే రిలీజ్

ఓట్లు అంటే చెప్పు తీసి కొడతా..! టీడీపీ నేతలను పరిగెత్తించిన ప్రజలు

మంత్రి ఇలాకాలో టీడీపీ దౌర్జన్యం.. ఏడాదైనా మహిళకు దక్కని న్యాయం

అభిషేక్ విధ్వంసం.. ఇషాన్ సెటైర్... సోషల్ మీడియాని షేక్ చేస్తున్న వీడియో

TDP నుండి YSRCP లోకి భారీ చేరికలు

ఆదర్శ కుటుంబం ఫస్ట్ రివ్యూ అవుట్.. గురూజీ కమ్ బ్యాక్ ఫిక్స్

నడి రోడ్డుపై గర్భిణీ స్త్రీల బట్టలు ఊడదీయడమే నీ సనాతన ధర్మమా?

వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన భారీ ట్రక్కు!

Photos

+5

విశ్వక్ సేన్‌ కల్ట్ మూవీ ప్రెస్‌మీట్.. (ఫోటోలు)

+5

తెలంగాణలో అద్భుతమైన అడ్వెంచర్ స్పాట్స్ ఎక్కడో తెలుసా? (ఫోటోలు)

+5

ముంబై : 'ELLE ఇండియా బ్యూటీ అవార్డ్స్ 2026' (ఫోటోలు)

+5

150 కిలోమీటర్ల ప్రచండ గాలులు... అర్నబ్ తుపాను బీభత్సం (ఫోటోలు)

+5

హైదరాబాద్ : హెబ్బా.. హోయ్‌రబ్బా! (ఫోటోలు)

+5

అర్నబ్ తుపాను విధ్వంసం.. కోనసీమ జిల్లా అతలాకుతలం (ఫోటోలు)

+5

‘KilleR’ సినిమా 1 కోటి రూపాయల కాంటెస్ట్ ప్రెస్‌మీట్ (ఫోటోలు)

+5

‘దొంగ నా కొడుకు’ మూవీ సాంగ్ లాంచ్ (ఫోటోలు)

+5

స్టాక్‌ మార్కెట్‌లోకి జియో.. అంబానీ కుటుంబంలో వెల్లివిరిసిన ఆనందాలు (ఫోటోలు)

+5

ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన హీరోయిన్ నివేదా పేతురాజ్ (ఫోటోలు)