Breaking News

ఒకటికి రెండు.. రెండుకు నాలుగు!  బెట్టింగ్ బంగార్రాజుల జోరు

Published on Thu, 04/04/2024 - 12:22

రండన్నా రండి.. వెయ్యికి రెండు వేలు.. లచ్ఛకు రెండు లచ్చలు.. గవర్నమెంట్ ఎవరిదీ వస్తుంది.. జగనా ? చంద్రబాబా ? ఎవరికీ ఎన్ని సీట్లు వస్తాయి. రండి పందెం కాసుకోండి అంటున్నారు గోదావరి జిల్లాల్లో పందెం రాయుళ్లు.. కోడిపందాలు.. క్రికెట్ పందాలు.. ఇలా రకరకాల పందేలకు పేరుగాంచిన భీమవరంలో ఇప్పుడు రాజకీయ పందేలు మొదలయ్యాయి. ఇంకా నెలన్నరలో ఎన్నికలు జరగనుండగా.. ఎవరికీ ఎన్ని సీట్లు వస్తాయి.. ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అంటూ ఇప్పుడే పందేలు కాస్తున్నారు.. ఈ మేరకు అగ్రిమెంట్లు చేస్తున్నారు. 

వాస్తవానికి ఈ రాజకీయ పందేలు గత దసరా నుంచే మొదలయ్యాయి...అప్పట్లో కొందరు టీడీపీ అభిమానులు సీఎం వైయస్ జగన్ సారధ్యంలోని వైఎస్సార్‌ కాంగ్రెసుకు యాభై సీట్లకన్నా తక్కువే వస్తాయని చెబుతూ అలా పందెం కాశారు. అది కూడా కోసు పందెం... అంటే ఫ్యానుకు యాభై సీట్లకు మించి వస్తే టీడీపీ వాళ్ళు రెండు రెట్లు.. మూడు రెట్లు డబ్బులిస్తారన్నమాట.. అంటే లక్ష పందెం కాసారనుకోండి.. జగన్ పార్టీకి యాభై సీట్లకు లోపు వస్తే ఆ లక్ష పోయినట్లు... కానీ యాభైకి మించి వస్తే టీడీపీ వాళ్ళు.. రెండు.. మూడు లక్షలు ఇస్తారన్నమాట.. ఇలా అప్పట్లో పందేలు ఫిక్స్ చేసుకుని నోట్లు.. అగ్రిమెంట్లు.. పెద్దమనుషుల  సమక్షంలో మాట కూడా తీసుకోవడం జరిగింది.. ఇదిలా ఉండగా సంక్రాంతి పోయాక పందెం తీరు మారింది... జగనుకు 70 - 80 సీట్లు వస్తాయంటూ సమపందెం కాస్తున్నారు. అంటే పందెంలో ఎంత వేస్తె అంత వస్తుంది.. ఎంత కాస్తే అంతే ఓడిపోతారు తప్ప.. రెండు మూడు రెట్లు అనేది ఉండదు.

ఇదిలా ఉండగా మర్చి నెలలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది.. మళ్ళీ జగన్ వస్తున్నారట.. పేదలు.. బీసీలు.. మహిళలు.. రైతులు అందరూ జగన్ పక్షాన ఉండడంతో ప్రభుత్వానికి ఎదురేలేదట.. నూట ఇరవై సీట్లతో మళ్ళీ జగన్ గెలుస్తున్నారట అనే భావన పల్లెల్లో మొదలైంది. దీంతో ఇప్పుడు ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేస్తారు అనేదానిమీద పందేలు కాస్తున్నారు. అయితే గతంలో జగన్ కు 50 సీట్లకు మించి రావంటూ రెండు మూడు రెట్లు ఇచ్చేలా పందెం ఖరారు చేసుకున్నవాళ్ళంటా ఇప్పుడు లబోదిబోమంటున్నారు. 

కూటమిలో సీట్ల చిచ్చు.. వాళ్ళిస్తున్న మ్యానిఫెస్టో.. హామీలను ప్రజలు నమ్మకపోవడం... గతంలో చంద్రబాబు ఇచ్చిన హామీలు ఎలా తుంగలోకి తొక్కింది.. ఇవన్నీ ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు.. అంతేకాకుండా చెప్పినమాటమీద.. ఇచ్చిన హామీ మీద నిలబడే జగన్ అంతే జనానికి నమ్మకం కుదిరిందని, ఇటు సంక్షేమం.. అటు అభివృద్ధి కూడా చేసి చూపుతున్న జగన్ గెలుపు విషయంలో సందేహాలు లేనేలేవని ప్రజల్లో అభిప్రాయాలూ గట్టిగా వినిపిస్తుండడంతో ఇప్పుడు పందెం తీరు మారింది.

ఎన్ని సీట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు.. వంద.. నూట ఇరవై.. ఇలా ఇప్పుడు పందేలు కాస్తున్నారు.. మొత్తానికి గతంలో ఉన్న పరిస్థితికి ఇప్పుడు పూర్తి భిన్నంగాఉండడంతో పందెం రాయుళ్లు ఇప్పుడు జగన్ గెలుపు మీద కాపు కాస్తున్నారు.. అయితే గతంలో టీడీపీ గెలుపు మీద లక్షల్లో అగ్రిమెంట్లు చేసుకున్న వాళ్లంతా ఇప్పుడు దిగాలు పడిపోతున్నారు.. ఈ నెలలో పరిస్థితి వైయస్సార్ కాంగ్రెస్ పరిస్థితి మరింత మెరుగై... నూట నలభై.. వరకూ ఎగబాకుతుందని.. కూడా పందెం రాయుళ్లు అంటున్నారు.. మరోవైపు జగన్ గెలిస్తే లక్ష ఇస్తాం.. టీడీపీ గెలిస్తే మీరు అరవై.. డెబ్బై వేలు ఇస్తే చాలు అన్నట్లుగా ఇప్పుడు ట్రెండ్ నడుస్తోంది.

-సిమ్మాదిరప్పన్న

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)