Breaking News

హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్.. కూటమిదే కశ్మీర్‌

Published on Tue, 10/08/2024 - 17:25

ఢిల్లీ: హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ మరోసారి ఘన విజయం సాధించింది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో బీజేపీ మ్యాజిక్‌ ఫిగర్‌ (46 స్థానాలు) దాటింది. కాంగ్రెస్‌ పార్టీ రెండో స్థానంలో నిలిచింది. దీంతో బీజేపీ మూడోసారి హర్యానాలో అధికారం చేపట్టనుంది. బీజేపీ భారీ విజయం సాధించటంతో హైకమాండ్‌ మళ్లీ హర్యానాకు సీఎంగా నయాబ్‌ సింగ్‌ సైనీకి ప్రకటించింది. 

ఇక.. ఇక్కడి ఆప్‌, జేజేపీ పార్టీలు  ఒక్కసీటు కూడా గెలువలేదు. మంగళవారం ఓట్ల లెక్కింపులో ఒక సయయంలో బీజేపీ పలు స్థానాల్లో వెనకంజలో ఉన్నా.. అనూహ్యంగా ఫలితాలు బీజేపీకి ఏకపక్షంగా వచ్చాయి. దీంతో ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలను బీజేపీ అనుకూలమైన తాజా ఫలితాల తలకిందులు చేశాయి.

ప్రస్తుతం సీఎం హర్యానా సైనీ.. ఆరు నెలల ముందే సీఎం పీఠంపై కూర్చున్నా.. పార్టీని హర్యానాలో గెలిపించుకున్నారు.  ఆశలు లేని స్థాయి నుంచి అనూహ్యంగా బీజేపీ విజయం సాధించింది. 1966 నుంచి హర్యానాలో ఏ పార్టీ కూడా వరసగా మూడు సార్లు అధికారం చేటపట్టలేదు. తాజాగా బీజేపీ ముచ్చటగా మూడోసారి గెలిచి ఆ ఆనవాయితీని బ్రేక్‌ చేసింది. 
 

హర్యానాలో

  • బీజేపీ: గెలుపు-48
  • కాంగ్రెస్‌: గెలుపు- 37
  • ఇతరులు:గెలుపు-5
     

ఇప్పటివరకు ఎన్నికల సంఘం వెల్లడించిన  అధికారిక ఫలితాలు..

జమ్ము కశ్మీర్‌లో  కాంగ్రెస్‌ కూటమి విజయం
జమ్ము కశ్మీర్‌  అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో జమ్ము కశ్మీర్‌ నేషనల్‌ కాన్ఫరెన్స్‌- కాంగ్రెస్‌ కూటమి ఘన విజయం సాధించింది. ఇప్పటివరకు వెలువడిన మ్యాజిక్‌ ఫిగర్‌ స్థానాలను కూటమి గెలుపొందింది. ఇక్కడ బీజేపీ రెండో స్థానంలో నిలిచింది.  ఆమ్‌ ఆద్మీ పార్టీ ఒక స్థానంలో విజయం సాధించింది. కాంగ్రెస్‌ కూటమిలో భాగస్వామ్య పార్టీగా ఉన్న సీపీఎం స్థానంలో గెలుపు. కాంగ్రెస్‌ ఆరు స్థానాల్లో విజయం సాధించింది.ఇక.. పీడీపీ కేవలం మూడు స్థానాలకు పరిమితమైంది. జమ్ము రీయన్‌లో  కూటమికి బీజేపీ గట్టి పోటీ ఇచ్చింది.  జమ్ము కశ్మీర్‌ ముఖ్యమంత్రిగా ఎన్సీ నేత ఒమర్‌ అబ్దుల్లా అవుతారని ఫరూఖ్‌ అబ్దుల్లా పేర్కొన్నారు.

జమ్ముకశ్మీర్‌లో

  • నేషనల్‌ కాన్ఫరెన్స్‌ - 42 సీట్లు
  • బీజేపీ - 29
  • కాంగ్రెస్‌ - 06
  • పీడీపీ - 03
  • సీపీఎం - 01
  • ఆప్‌ - 01
  • జేపీసీ - 01
  • స్వతంత్రులు - 07
  • మొత్తం స్థానాలు: 90

Videos

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)