Breaking News

ఎమర్జెన్సీకన్నా దారుణం

Published on Sat, 09/14/2024 - 06:13

సాక్షి, హైదరాబాద్‌:  రాష్ట్రంలో ఎమర్జెన్సీ కన్నా దా­రు­ణ పరిస్థితులు నెలకొన్నాయని.. సీఎం రేవంత్‌ చేస్తున్న రాజకీయ డ్రామాలతో రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతింటోందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. ఆదిలాబాద్‌ నుంచి అలంపూర్‌ వరకు బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టులు దుర్మార్గమని విమర్శించారు. బీఆర్‌ఎస్‌పై, కేసీఆర్‌పై ఉన్న కక్షను తెలంగాణ మీద చూపుతున్నారని.. నంబర్‌ వన్‌గా ఉన్న రాష్ట్రాన్ని నియంతృత్వ పోకడలతో నిరీ్వర్యం చేస్తున్నారని ఆరోపించారు. రేవంత్‌ వైఖరి వల్ల రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు.

గురువారం కోకాపేటలోని తన నివాసంలో ఎమ్మెల్యే సంజయ్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, పార్టీ నేతలు దేవీప్రసాద్, ఎర్రోళ్ల శ్రీనివాస్‌ తదితరులతో కలిసి హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. ‘‘శాంతి భద్రతలను అదుపు చేయకుండా హైదరాబాద్, తెలంగాణ బ్రాండ్‌ ఇమేజ్‌ గురించి రేవంత్‌ మాట్లాడటం సిగ్గుచేటు. రేవంత్, డీజీపీ ఎమ్మెల్యే గాం«దీకి బందోబస్తు ఇచ్చి ఎమ్మెల్యే కౌశిక్‌ నివాసంపై దాడులు చేయించారు. కౌశిక్‌ నివాసంపై దాడి చేసింది గాంధీ కాదు సీఎం రేవంత్‌. బీఆర్‌ఎస్‌ నేతలను గృహ నిర్బంధం చేసిన పోలీసులు గాం«దీని ఎందుకు నిర్బంధించలేదు?’’అని ప్రశ్నించారు. హత్యాయత్నం చేసిన అరికెపూడి, ఆయన అనుచరులను బందోబస్తు మధ్య ఇంటికి పంపి.. తమను మాత్రం అరెస్టు చేసి అర్ధర్రాతి అటవీ ప్రాంతాల్లో తిప్పారని విమర్శించారు. 

భాషను మార్చుకోకుండా నీతులా? 
సీఎం రేవంత్‌ తన అసభ్య, సంస్కారహీనమైన భాషను మార్చుకోకుండా యూట్యూబ్‌ చానళ్లకు నీతులు చెబుతున్నారని.. తొమ్మిది నెలలుగా పాలనపై కాకుండా పైసలపై దృష్టి పెట్టడంతో శాంతి భద్రతలు పాతాళానికి పడిపోయాయని హరీశ్‌రావు ఆరోపించారు. ‘‘మీడియాకు లీకులు, చిట్‌చాట్‌లతో శాంతి భద్రతలు అదుపులోకి రావు. సీఎం వాడుతున్న బజారు భాషతో రాష్ట్రంలో విద్వేషాలు చెలరేగి ప్రశాంతత మంటగలుస్తోంది. పార్టీ ఫిరాయింపులపై సీఎం ఢిల్లీలో ఒకలా, గల్లీలో మరోలా మాట్లాడుతున్నారు. పీఏసీ చైర్మన్‌ నియామకంలో రేవంత్‌ వ్యాఖ్యలు దుర్మార్గం. డీజీపీ రాజకీయ కుట్రలో భాగమై ప్రతిపక్షాల గొంతును నొక్కాలని చూడటం దారుణం’’అని విమర్శించారు. ఎమ్మెల్యేల ఫిరాయింపు, పీఏసీ చైర్మన్‌ నియామకాన్ని వ్యక్తుల మధ్య కొట్లాటగా చిత్రీకరించి పక్కదారి పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.

Videos

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)