Breaking News

‘‘100 కోట్లు వెనక్కి సరే.. ఒప్పందాల మాటేమిటి రేవంత్‌?’’

Published on Mon, 11/25/2024 - 19:19

సాక్షి,హైదరాబాద్‌ : రూ.100 కోట్ల నిధులు వెనక్కి ఇస్తున్నారు సరే.. అదానీతో కుదుర్చుకున్న రూ.12,400 కోట్ల ఒప్పందాల సంగతి ఏంటని ప్రశ్నించారు మాజీ మంత్రి హరీష్ రావు.  

యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి ఆదాని ఇచ్చిన రూ.100 కోట్ల నిధులను వెనక్కి ఇస్తున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి అధికారికంగా ప్రకటించారు. రేవంత్ సర్కార్ నిర్ణయంపై హరీష్ రావు ఎక్స్ వేదికగా స్పందించారు. 

‘‘యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి ఆదాని ఇచ్చిన 100 కోట్ల నిధులను వెనక్కి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న రేవంత్‌రెడ్డి .. మరి, రాహుల్ గాంధీ అదాని అవినీతి మీద జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని నినదిస్తున్న సమయంలో దావోస్ లో మీరు ఆదానితో  చేసుకున్న 12,400 కోట్ల ఒప్పందాల సంగతేమిటి?

అదానీకి రాష్ట్రంలోని డిస్కంలను అప్పగించి వాటిని ప్రైవేటీకరించేందుకు మీరు చేస్తున్న కుట్రల మాటేమిటి?. 20 వేల మెగావాట్ల థర్మల్ ప్లాంట్ పెడుతామనే ప్రతిపాదనతో వస్తే, మర్యాదపూర్వకంగా కలిసి చాయ్ తాగించి పంపించేశాం. కానీ కాంగ్రెస్ ద్వంద్వ ప్రమాణాలు పాటించింది. రాహుల్ గాంధీ అవినీతి పరుడు అన్న వ్యక్తికే గల్లీ కాంగ్రెస్ రెడ్ కార్పెట్ పరిచింది.

ఢిల్లీలో రాహుల్ వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఆదానితో రేవంత్ రెడ్డి దోస్తీ చేసి ఒప్పందాలు చేసుకున్నాడు. ఇప్పుడు ఆదాని అవినీతి బయటికిరాగానే మాట మార్చారు. తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం అదానీతో చేసుకున్న ఒప్పందాల‌న్నింటినీ ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేస్తున్నాం’’ అని ఎక్స్ వేదికగా చేసిన ట్వీట్‌లో హరీష్ రావు స్పష్టం చేశారు. 

 

Videos

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)