Breaking News

కాంగ్రెస్, బీజేపీలు రైతు వ్యతిరేక పార్టీలు

Published on Fri, 04/12/2024 - 03:28

సాక్షి, సిద్దిపేట: ‘కాంగ్రెస్, బీజేపీలు రైతు వ్యతిరేక పార్టీలు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్‌ మోసం చేసింది. బీజేపీ నల్ల చట్టాలను తీసుకువచ్చింది’అని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. కానీ కేసీఆర్‌ రైతు నేస్తం అని, ఆయన చెప్పినవి, చెప్పనవి కూడా చేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ చెప్పినవే చేయడం లేదని, అందుకే ఆ పార్టీపై చీటింగ్‌ కేసు పెట్టాలని డిమాండ్‌ చేశారు. గురువారం సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం పెద్ద కోడూరులో జరిగిన బీఆర్‌ఎస్‌ పార్టీ మెదక్‌ పార్లమెంటరీ నియోజకవర్గ సమావేశంలో హరీశ్‌రావు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లా డుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్‌ పని అయిపోయిందని, ఆ పార్టీని నమ్మి మోసపోయామని ప్రజలు అనుకుంటున్నారని అన్నారు. రూ.90 వేలకోట్ల ఖర్చుతో కేసీఆర్‌ విద్యుత్‌ వ్యవస్థను బాగు చేశారన్నారు. కేసీఆర్‌ పాలనలో పదేళ్లు కరువే లేదన్నారు. కాంగ్రెస్‌ అడుగుపెట్టింది.. మళ్లీ కరువొచ్చిందన్నారు. మళ్లీ బోర్లలో పూడిక తీసుడు.. కరెంటు మోటార్లు కాలుడు మొదలైందని విమర్శించారు. రాష్ట్రంలో లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ వాళ్లకు చురక పెడితేనే దారికొస్తారన్నారు. సమావేశం అనంతరం కార్యకర్తలకు హరీశ్‌రావు స్వయంగా భోజనాలు వడ్డించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ పార్టీ మెదక్‌ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)