Breaking News

తడి బట్టలతో గుడికి రా రేవంత్‌.. హరీష్ రావు సవాల్

Published on Sun, 01/26/2025 - 19:22

సాక్షి, సిద్ధిపేట: మహబూబ్‌నగర్ పెండింగ్ ప్రాజెక్టులను బీఆర్ఎస్ పార్టీ పట్టించుకోలేదంటూ సీఎం  రేవంత్ అబద్దాలాడుతున్నారని మాజీ మంత్రి హరీష్‌రావు మండిపడ్డారు. ఆదివారం ఆయన గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్‌ పాలకవర్గం అభినందన సభలో మాట్లాడుతూ.. ‘‘దేవుడిపై నమ్మకం ఉంటే కురుమూర్తి ఆలయానికి రేవంత్‌  రావాలి.. తడి బట్టలతో నువ్వు, నేను గుడిలోకి వెళ్దాం’’ అంటూ హరీష్‌రావు సవాల్‌ విసిరారు. టీడీపీ పదేళ్లు,  కాంగ్రెస్‌ హయాంలో పదేళ్ల పాటు ప్రాజెక్టులను పట్టించుకోలేదు. కొడంగల్‌లో ప్రశ్నించిన పాపానికి రైతులకు బేడీలు వేయించారు. ఆనాడు ఏ దరఖాస్తు లేకుండా కేసీఆర్‌ సంక్షేమ పథకాలు అమలు చేయలేదా? అంటూ హరీష్‌రావు ప్రశ్నించారు.

‘‘11 విడతల్లో రూ.73 వేల కోట్ల రూపాయలు రైతు బంధు ఇచ్చిండు కేసీఆర్. 13 లక్షల మందికి లక్ష రూపాయల చొప్పున తిప్పలు పడకుండ కళ్యాణ లక్ష్మి ఇచ్చినం. ఏ దరఖాస్తు లేకుండా 57 ఏళ్లకే ఆసరా పెన్షన్ ఇచ్చిన ఘనత కేసీఆర్‌ది.

..ఎంత సేపు ప్రతిపక్షాలను తిట్టుడు.. కేసీఆర్‌ను తిట్టుడు తప్పా రేవంత్ రెడ్డికి పాలన చేతకాదు. అప్పుడేమో దేవుళ్ల మీద ఒట్టు పెట్టి ముక్కోటి దేవుళ్లను మోసం చేసిండు. ఈ రోజేమో గణతంత్ర దినోత్సవం సాక్షిగా అందరికీ సంక్షేమ పథకాలు ఇస్తానని చెప్పి మళ్ళీ కొందరికే అని గణతంత్ర దినోత్సవం రోజున అంబేద్కర్‌ను కూడా మోసం చేసిండు’’ అంటూ హరీష్‌రావు ధ్వజమెత్తారు.

ఇదీ చదవండి: బండి సంజయ్‌ వ్యాఖ్యలపై కవిత ఫైర్‌

Videos

నేను తాడిపత్రి పోతా.. ఏం పీకుతారో పీక్కోండి.. మాస్ వార్నింగ్

మరి గోరం... హీరోయిన్ ఎంగిలి చేసిన బాటిల్ ధర రూ.3 లక్షలు..!

అనంతపురం రూరల్ EX ZPTCపై పోలీసుల ఓవర్ యాక్షన్

జోగి రమేష్ హౌస్ అరెస్ట్

ఆ 15 స్థానాల్లో పోటీయే లేదు..! లైవ్ లో మొత్తం బయటపెట్టిన YS జగన్

సంచలనం రేపుతున్న ప్రశాంత్ భూషణ్ ట్వీట్

ఏం చంపుతావా? విడదల రజినీని నెట్టేసి కిందపడేసిన SI

బంగారానికి ఏమైంది? వరుసగా పడిపోతున్న ధరలు!

జగన్ లాస్ట్ పంచ్... జస్ట్ సింగిల్ డిజిట్!

పోరాడిన ప్రతి అక్కచెల్లమ్మకు హ్యాట్స్ ఆఫ్.. జగన్ ఎమోషనల్

Photos

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం...నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)

+5

సన్ ఫ్లవర్ తో రితికా నాయక్‌ (ఫొటోలు)

+5

సంజూ, నమన్ మెరుపులు.. ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచిన భారత్ (ఫొటోలు)