Breaking News

కేటీఆర్‌ అతి తెలివి ప్రదర్శించొద్దు: గుత్తా

Published on Fri, 10/18/2024 - 10:21

సాక్షి, నల్గొండ: కేటీఆర్‌ అతి తెలివి ప్రదర్శిస్తున్నాడంటూ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, 50 అంతస్తుల భవనాలకు ఎవరు అనుమతి ఇచ్చారు? అని ప్రశ్నించారు. అక్రమ నిర్మాణాలన్నీ బీఆర్ఎస్ హయాంలోనే జరిగాయని.. ఎవరేం పాపాలు చేశారో వారి ఆత్మలకు తెలుసు. ఒకసారి‌ పరిశీలన చేసుకోవాలంటూ గుత్తా వ్యాఖ్యానించారు.

‘‘మూసీ ప్రక్షాళనకు వాజ్‌పేయ్‌ హయాంలోనే బీజం పడింది. కేసీఆర్‌ కూడా మూసీ రివర్‌ ఫ్రంట్‌ బోర్డు ఏర్పాటు చేశారు. సుందరీకరణ పేరుతో రేవంత్‌ దోచుకుంటున్నారనడం తగదు. నల్లగొండ జిల్లా ప్రజలు బాగుపడాలంటే మూసీ ప్రక్షాళన జరగాలి. మూసీ ప్రక్షాళనపై ప్రతిపక్షాల రాద్ధాంతం సరికాదు’’ అని గుత్తా హితవు పలికారు.

అత్యుత్సాహం ప్రదర్శించొద్దు. అలా ప్రదర్శిస్తే మొన్నటి ఎన్నికల్లో ఏమైంది? మీ స్వార్థం కోసం ౫౦ అంతస్తుల భవనాలకు అనుమతి ఇచ్చి ఇబ్బందులకు గురిచేశారు.  మీరు చేస్తే సుందరీకరణ అవతలోడు చేస్తే దోచుకోవడమా? రూ. 16500 కోట్లతో మూసీ సుందరీకరణ కు ప్రతిపాదనలు చేసింది బీఆర్ఎస్ కాదా? దేశభద్రత కు ఉపయోగపడే రాడార్ ఏర్పాటు విషయంలో కూడా విమర్శలేనా?. రాడార్ విషయంలో జీవోలు ఇచ్చింది‌ బీఆర్ఎస్ కాదా?’’ అంటే గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రశ్నలు గుప్పించారు.

మూసీ ప్రక్షాళన కోసం ప్రజలు ఉద్యమించాల్సిన అవసరం ఉంది. ప్రక్షాళన వద్దని చెప్పే పార్టీలకు గుణపాఠం చెప్పాలి. మూసీ పరివాహక ప్రాంతాల్లో నోరు తెరిస్తే దోమలే లోపలికి పోతాయి. నది గర్భంలో ఉన్న ఇళ్లను తొలుత తొలగించాలి. యాభై అంతస్తులు కట్టే వారంతా మట్టిని తవ్వి మూసీలోనే పోస్తున్నారు. అక్రమ నిర్మాణాల వల్ల జరిగే నష్టం, సెల్లార్లలో తీసిన మట్టి ఎటుపోతుందనేది కూడా హైడ్రా దృష్టి పెట్టాలి’’ అంటూ గుత్తా సూచించారు.

కేటీఆర్ అతి తెలివి
 

Videos

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)