Breaking News

ఎమ్మెల్యే ఆంజనేయులు ప్రోద్భలంతోనే ప్రసాద్‌పై దాడి: వైఎస్సార్‌సీపీ

Published on Tue, 08/26/2025 - 16:56

సాక్షి, గుంటూరు: వైఎస్సార్‌సీపీ నేత భీమనాథం వెంకట ప్రసాద్‌ కుటుంబాన్ని ఆ పార్టీ నేతలు మంగళవారం పరామర్శించారు. ప్రసాద్‌  ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైఎస్సార్‌సీపీ నేతలు మీడియాతో మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ.. ‘‘టి.అన్నవరం తెలుగుదేశం పార్టీకి రిగ్గింగ్ గ్రామం. 2024 ఎన్నికల్లో వెంకట ప్రసాద్ వైఎస్సార్‌సీపీ బూత్ ఏజెంట్‌గా ఉన్నాడు.

..వెంకట ప్రసాద్ బ్రతికి ఉంటే రాజకీయంగా తమకు ఇబ్బంది అవుతుందని టీడీపీ నాయకులు భావించారు. కొన్నాళ్లుగా వెంకట ప్రసాద్‌ను చంపాలని కుట్ర పన్నారు. ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ప్రోద్బలంతోనే వెంకట ప్రసాద్‌పై దాడి జరిగింది. చావు బతుకుల మధ్య వెంకట ప్రసాద్ ఉంటే పోలీసులు ఆయనపైనే కేసు పెట్టారు. ఇదేం పోలీస్ వ్యవస్థ. వెంకటప్రసాద్‌పై పోలీసులు పెట్టిన కేసుపై న్యాయ పోరాటం చేస్తాం’’ అని ఆయన పేర్కొన్నారు.

మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. పల్నాడు జిల్లాలో పోలీసులు విచిత్రంగా ప్రవర్తిస్తున్నారని.. రషీద్‌ను చంపినట్టే వెంకట ప్రసాద్‌ను హత్య చేసేందుకు తెలుగుదేశం నేతలు ప్రయత్నించారు’’ ఆయన మండిపడ్డారు. ‘‘చివరకు వెంకట ప్రసాద్ చనిపోయాడనుకుని వదిలేసి వెళ్లిపోయారు. పోలీసులు నేరస్తులతో కుమ్మక్కై బాధితుడు పైనే కేసు పెట్టారు. నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేయవలసిన పోలీసులు చిన్నపాటి కేసు పెట్టారు. ఈ కేసులో హత్యాయత్నం కేసుగా నమోదు చేయాలంటే ఐజీ సర్వ శ్రేష్ట త్రిపాఠిను కలవాలి. ఆయన్ని కలవాలంటే చంద్రబాబు, లోకేష్‌ల వద్దకు వెళ్లాలి. అప్పుడు కానీ ఐజీ కలవరు. పోలీసులు.. నేరస్తులతో కుమ్మక్కవడం ఈ సమాజానికి ప్రమాదకరం’’ అని అంబటి చెప్పారు.

మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. పల్నాడు జిల్లాలో టీడీపీ నాయకులు బరితెగించారని మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీకి చెందిన ఒక బీసీ నేతపై అత్యంత దారుణంగా కత్తితో దాడి చేశారు. బాధితులపైనే పోలీసులు కేసు నమోదు చేయడం విడ్డూరంగా  ఉంది. దీనిపై న్యాయ పోరాటం చేస్తాం.’’ అని గోపిరెడ్డి పేర్కొన్నారు.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)