Breaking News

దావోస్‌ వెళ్లి రికార్డింగ్‌ డ్యాన్సులు పెట్టామని చెబుతారా?

Published on Tue, 01/20/2026 - 12:24

సాక్షి, విశాఖపట్నం: అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు.. విశాఖలో ఆంధ్రజ్యోతికి చంద్రబాబు భూ కేటాయింపు చేశారని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ అన్నారు. బాబు పాలనలో ఏపీలో ఏ వర్గం కూడా సంతోషంగా లేదని.. వైఎస్సార్సీపీ హయాంలో జరిగిన అభివృద్ధినే ఇప్పుడు దావోస్‌లో కూటమి పెద్దలు చెప్పుకుంటారేమోనని ఎద్దేవా చేశారాయన. మంగళవారం మీడియాతో అమర్నాథ్‌ మాట్లాడుతూ..

వెన్నుపోట్లు, పొలిటికల్ మార్కెటింగ్, మేనేజ్మెంట్‌లో నిజంగానే చంద్రబాబు యూనిక్ పీస్. చంద్రబాబు, లోకేష్ క్రెడిట్ చోరీలో సిద్ధహస్తులు. శంషాబాద్ ఎయిర్పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్డు, హైదరాబాదు నగరం, భోగాపురం  ఎయిర్‌పోర్ట్‌.. ఇలా అన్ని తానే కట్టినట్లు చంద్రబాబు చెప్పుకుంటున్నారు. నారావారి దిష్టిబొమ్మ రాష్ట్రంలో అభివృద్ధి అంతా తనతోనే జరిగిందని చెప్పుకుంటోంది. 

దావోస్‌కు వెళ్ళింది చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్‌తో కాదు.. టీడీపీ బ్యాండ్ మేళంతో. వైఎస్సార్సీపి పై విమర్శలు చేయడానికి దావోస్ ను వేదికగా వాడుకోబోతున్నారు. అసలు దావోస్ వెళ్లి పెద్ద పెద్ద రికార్డింగ్ డాన్సులు పెట్టామని చెప్పుకుంటారా?.. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి దావోస్ వెళ్లి మీ డప్పు మీరు కొట్టుకుంటారా?. పండుగ పేరు చెప్పి అశ్లీల నృత్యాలు నిర్వహిస్తే రాష్ట్రం బ్రాండ్‌ ఇమేజ్‌ దెబ్బ తినదా?..

వైఎస్ కుటుంబం గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. ఎన్టీఆర్ పేరు చెప్పుకోనీ బతికింది మీరు. నారా రామ్మూర్తి నాయుడునీ గొలుసులతో కట్టేసిన చరిత్ర మీది. లోకేష్ కు బ్యాక్ ఎక్కువ మైండ్ తక్కువ. రెండేళ్లలో మీరు ఒక పరిశ్రమనైనా తెచ్చారా?. .ఏపీకి వైఎస్‌ జగన్‌ తెచ్చిన పరిశ్రమలు తాము తెచ్చినట్లుగా చంద్రబాబు లోకేష్‌లు క్రెడిట్‌ చోరీ చేస్తున్నారు. ఇప్పుడు దావోస్ వెళ్లి పొలిటికల్ మార్కెటింగ్ చేసుకున్నారు.

చంద్రబాబు గొప్ప గురించి ప్రజల చెప్పాలి. అంతేగానీ తనకు తానే విజనరీ అని సొంత డప్పు కొట్టుకోవడం కాదు. చలి ఉంటుంది కాబట్టి మేము దావోస్ వెళ్లలేదని గతంలో నేను అన్నట్లు ప్రచారం చేశారు. అది లోకేష్ నిరూపిస్తే నేను రాజకీయాలను తప్పుకుంటాను. నిరూపించలేక పోతే క్షమాపణ చెబుతావా. ఒక సీఎం కొడుకువై ఉండి అబద్ధాలు చెప్పడానికి సిగ్గు లేదా?..

లోకేష్ కు బ్యాక్ ఎక్కువ.. మైండ్ తక్కువ.. లోకేష్ లింగం పై అమర్నాథ్ పంచులు

ఆంధ్రజ్యోతి సొంత సంస్థ కాబట్టి ఇష్టానుసారంగా భూమి కేటాయించారు. మా ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తే ఆంధ్రజ్యోతికి భూ కేటాయింపుపై చర్యలు ఉంటాయి.. నిబంధన ప్రకారం భూ కేటాయింపు జరపమని కోర్టు చెబితే.. పట్టించుకోలేదు. ఆంధ్రజ్యోతి మీద అంత ప్రేమ ఉంటే హెరిటేజ్ భూములను ఇవ్వండి. అంతేగానీ ఇష్టానుసారం చేస్తామంటే కుదరదు. ఇప్పటికే విశాఖ నగరంలో భూములను పప్పు బెల్లాళ్లా పంచారు అని అమర్నాథ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు