Breaking News

విశాఖ చరిత్రలో ఇవాళ బ్లాక్‌డే

Published on Fri, 01/30/2026 - 13:23

సాక్షి, విశాఖపట్నం: కూటమి ప్రభుత్వం చట్ట విరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోందని వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌ సమావేశంలో ఇవాళ జరిగిన రసాభాసపై శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

‘‘కౌన్సిల్‌లో వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లపై దాడి చేసి గాయపరిచారు. మహిళా కార్పొరేటర్లని కూడా చూడలేదు. డిప్యూటీ మేయర్‌పై పాశవికంగా దాడి చేశారు. అవినీతికి, దోపిడీకి వ్యతిరేకంగా శాంతి యుత నిరసన చేపడితే దాడి చేయడం ఏంటి?..

.. కూటమి ప్రభుత్వంలో సిగ్గూ, శరం లేకుండా భూముల్ని దోచేస్తున్నారు. రూ.5 వేల కోట్ల విలువ చేసే భూముల్ని గీతంకు కట్టబెట్టారు. గీతంకు భూములు అప్పగించిన ఈ రోజు బ్లాక్‌డే. ఈ కేటాయింపులపై చట్టపరంగా పోరాటం చేస్తాం’’ అని బొత్స స్పష్టం చేశారు.

అంతకు ముందు.. గీతం యూనివర్సిటీ వివాదాస్పద భూములపై వైఎస్సార్‌సీపీ నిరసన వ్యక్తం చేసింది. జీవీఎంసీ ధర్నా చౌక్ దగ్గర శాంతియుత నిరసన దీక్ష చేపట్టింది. వైఎస్సార్‌సీపీ నేతలంతా నల్ల కండువాలతో జీవీఎంసీ కౌన్సిల్ సమావేశానికి వెళ్లారు. ఈ నిరసన కార్యక్రమంలో.. బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు, ఆయన కుటుంబం విశాఖపట్నంలో భూ దోపిడీకి తెరలేపిందన్నారు. అధికారం ఉందని ప్రజల భూములను దోపిడీ చేస్తే పేద కుటుంబాల కోసం తాము పోరాటం చేస్తామని పేర్కొన్నారు. విశాఖ ప్రజల ఆస్తులను కాపాడటమే లక్ష్యంగా ఈ నిరసన చేపట్టాం.. ప్రజా వ్యతిరేక పనులను తాము ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారాయన. 

గీతం యూనివర్సిటీ భూముల రెగ్యులరైజేషన్ ప్రతిపాదన ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమని, ఇది అక్రమాలకు చట్టబద్ధత ఇవ్వడమే అవుతుందని చెబుతూ వైఎస్సార్‌సీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అయితే వైఎస్సార్‌సీపీతో పాటు వామపక్ష పార్టీల అభ్యంతరాలను పట్టించుకోకుండా జీవీఎంసీ కౌన్సిల్‌ భేటీలో గీతం భూముల క్రమబద్దీకరణ చేసింది కూటమి ప్రభుత్వం. 

Videos

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు