Breaking News

‘ఉత్తర’ కుమారుడు.. మళ్లీ భీమిలికి..

Published on Sat, 03/30/2024 - 08:21

సాక్షి, విశాఖపట్నం: ఆయనో రాజకీయ సంచారజీవి.. పిల్లిపిల్లలను మార్చిన చందంగా ఎన్నికలకో నియోజకవర్గం మారుస్తూ.. పోటీ చేసిన ప్రతి నియోజకవర్గంలో ప్రజల్ని ఏమారుస్తూ.. గెలిచిన తర్వాత.. ఓటర్లను మోసం చేస్తూ.. చివరి నిమిషంలో అక్కడి నుంచి జంప్‌ అయిపోతారు. ఎన్నికలకో సెగ్మెంట్‌ మారుస్తున్న గంటా శ్రీనివాసరావు అడ్డగోలు సంపాదన, స్థిర, చరాస్థులను కూడబెట్టడంలో మాత్రం ఏకరీతినే దూసుకుపోయారు. నిన్న మొన్నటి వరకూ టికెట్‌ కోసం అధిష్టానం చుట్టూ కాళ్లరిగేలా తిరిగే స్థితికి చేరుకున్న గంటాకు.. చీపురుపల్లిలో పోటీ చేయాల్సిందేనని చంద్రబాబు తేల్చి చెప్పగా.. చివరికి బతిమాలుకొని భీమిలి టికెట్‌ సంపాదించుకున్నారు.

ఈ ఎన్నికల్లో తన వలస రాజకీయంతో మరోసారి భీమిలి ప్రజలను మోసం చేసేందుకు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. ప్రకాశం జిల్లా నుంచి బతుకుదెరువు కోసం విశాఖకు వలస వచ్చి ఓ దినపత్రికలో యాడ్‌ ఎగ్జిక్యూటివ్‌గా జీవితాన్ని ప్రారంభించాడు. చిరుద్యోగిగా ఆదాయ ప్రస్థానం మొదలుపెట్టిన గంటా.. ఆ తర్వాత షిప్పింగ్‌ రంగంలో వ్యాపారవేత్తగా ఎదిగారు.

1999లో అనూహ్య రీతిలో టీడీపీ తరఫున అనకాపల్లి ఎంపీగా, ఆ తర్వాత 2004లో చోడవరం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా, 2009లో ప్రజారాజ్యం తరఫున అనకాపల్లి ఎమ్మెల్యేగా, 2014లో భీమిలి నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా, 2019లో విశాఖ ఉత్తర ఎమ్మెల్యేగా గెలుపొందారు. నిజానికి 1999లో ప్రజాప్రతినిధిగా రాజకీయ జీవితం మొదలుపెట్టినా.. కాంగ్రెస్‌లో ప్రజారాజ్యం విలీనమైన పరిణామాల నేపథ్యంలో 2011లో తొలిసారి మంత్రి బాధ్యతలు స్వీకరించారు. అప్పటినుంచి క్రమక్రమంగా ఆరోపణలు వెల్లువెత్తుతూ వచ్చాయి. ఇక 2014లో టీడీపీ ప్రభుత్వం కొలువుదీరడంతో గంటాకు మళ్లీ మంత్రి పదవి రావడం దరిమిలా మొదలైన అవినీతి, అక్రమార్జన పర్వం, దోపిడీ పరాకాష్టకు చేరుకుంది.

అంతులేని గంటా గ్యాంగ్‌ దందాలు 
ఎన్ని అవినీతి ఆరోపణలు వచ్చినా లెక్క చెయ్యకుండా.. అవినీతిని కొనసాగించడమే గంటా స్టైల్‌. గంటా విశాఖ నగరంలోని ఎంవీపీ కాలనీలో ఉంటున్న బహుళ అంతస్తుల భవంతితో పాటు.. ప్రత్యూష పేరుతో కంపెనీ స్థాపించి.. రూ.200 కోట్లకు పైగా రుణాలు తీసుకొని ఎగ్గొట్టేశారు. దీంతో సదరు ఇండియన్‌ బ్యాంకు గంటా అండ్‌ కో అడ్డగోలుగా సంపాదించిన పలు స్థలాల్ని వేలం వేస్తుండగా.. మరికొన్ని స్థలాల్ని స్వా«దీనం చేసుకుంది. గంటా దోపిడీ పర్వాన్ని మొత్తం లెక్క కడితే రూ.వందల కోట్లపైనే ఉంటుందని టీడీపీ నేతలే అంచనా వేస్తున్నారు.

2014 నుంచి 2019 వరకూ గంటా గ్యాంగ్‌ భీమిలిలో సాగించిన భూదందాలతో మళ్లీ అక్కడ మొఖం చూపించలేని పరిస్థితిని తెచ్చుకున్నారు. నమ్ముకొని ఓటేసిన భీమిలి ప్రజలకు ఏమాత్రం మంచి చెయ్యకుండా కనిపిస్తే కబ్జా పేరుతో దందా సాగించారు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు అండ్‌ కో విశాఖలో భూ దందాలకు తెగబడినప్పుడు కీలక సూత్రధారి గంటాయేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గంటా శ్రీనివాసరావే భూదొంగ అంటూ అదే పారీ్టకి చెందిన సీనియర్‌ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడే స్వయంగా సిట్‌కు ఫిర్యాదు చేయడంతో కలకలం రేగింది. అక్రమాల ఆరోపణలు చుట్టుముట్టడంతో తరుణంలో భీమిలి నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని గంటా నిర్ణయించుకున్నారు.  

ఓటేసిన జనాన్ని లెక్క చేయని గంటా..
తాను చేసిన అక్రమాలు, అవినీతి పనులు బట్టబయలు కావడంతో 2019 ఎన్నికల్లో భీమిలి ప్రజలు ఛీకొడతారని ముందుగానే ఊహించిన గంటా.. వ్యూహాత్మకంగా బీజేపీకి కేటాయించిన విశాఖ ఉత్తర సీటును దక్కించుకున్నారు. ఎలాగోలా భీమిలి నుంచి బయటపడి టికెట్‌ తెచ్చుకున్న గంటా.. ఎన్నికల సమయంలో ఉత్తర నియోజకవర్గ ప్రజల్ని మోసపూరిత హామీలతో మభ్యపెట్టారు. పోలింగ్‌ సమయంలో చివరి నిమిషంలో బర్మాక్యాంపు తదితర కొండవాలు ప్రాంతాల్లో దొంగ ఓట్ల వ్యవహారంతో గట్టెక్కి విజయం సాధించారు.

అంతే ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత నేటి వరకూ ఉత్తర ప్రజలకు ఒక్కసారైన మొహం చూపించకుండా ఎంవీపీలోనే తిష్టవేసుక్కూర్చున్నారు. తాము ఓటేసి గెలిపించిన పాపానికి తగిన శాస్తి జరిగిందంటూ ఆవేదన చెందుతున్న నియోజకవర్గ ప్రజలకు వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త కేకే రాజు అండగా నిలబడ్డారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు.

ఈసారి ఉత్తరంలో పోటీ చేస్తే.. ఓటమి తప్పదని భావించిన గంటా.. మరోసారి భీమిలికి వెళ్లిపోవాలని అక్కడి నేతలతో మంతనాలు ప్రారంభించారు. గెలుపొందిన చోట్ల దోపిడీకి పాల్పడే గంటా చేతిలో మరోసారి తాము మోసపోయే స్థితిలో లేమని భీమిలి ప్రజలంతా ముక్త కంఠంతో చెబుతున్నారు. అయినా నిస్సిగ్గుగా భీమిలిని దోచుకునేందుకు గంటా మళ్లీ బయలుదేరడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)