Breaking News

బీసీల సభలో టీడీపీ నేతలే ఎక్కువ..

Published on Tue, 08/22/2023 - 05:17

రామవరప్పాడు/గన్నవరం : లోకేశ్‌ యువగళం పాదయాత్ర కృష్ణాజిల్లా గన్నవరం నియో­­జ­కవర్గంలో ప్రజలు, ప్రయాణికుల సహనా­నికి పరీక్ష పెట్టింది. విజయవాడ రూరల్‌ మండలం నిడమానూరుకు చేరుకున్న పాదయాత్ర విజయ­వాడ మీదుగా సోమవారం గన్నవరం నియో­జకవర్గానికి చేరు­కో­గా.. సాయంత్రం నిడమానూ­రు క్యాంప్‌ సైట్‌లో బీసీ సామజికవర్గాల ప్రతినిధులతో లోకేశ్‌ ముఖా­ముఖి నిర్వహించారు.

సమావేశంలో బీసీ ప్రతి­నిధుల కంటే టీడీపీ నేతలే ఎక్కువగా ఉన్నారు. సమా­వేశంలో.. ‘ చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ముస్లిం మైనార్టీలకు ఏం చేశాడ’ని లోకేశ్‌ను ప్రశ్నించేందుకు ప్రయత్నించిన ముస్లిం రైట్స్‌ అండ్‌ వెల్ఫేర్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు సయ్యద్‌ నూరుద్దీన్‌ను పోలీసులు అడ్డుకున్నారు. లోకేశ్‌ మాట్లాడుతుండగానే జనం మెల్లగా జారుకున్నారు.

గన్నవరం చేరుకున్న పాదయాత్ర
అనంతరం.. లోకేశ్‌ పాదయాత్ర సోమవారం రాత్రి కృష్ణాజిల్లా గన్నవరం చేరుకుంది. అంతకుముందు, కేసరపల్లి వద్ద మండలంలోకి ప్రవేశించిన యాత్ర ఎయిర్‌పోర్ట్, దుర్గాపురం, గన్నవరం మీదుగా చిన్నఆవుటపల్లిలోని ఎన్‌ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ ఆవరణలో క్యాంప్‌ సైట్‌కు చేరుకుంది. పాదయాత్ర జాతీయ రహదారిపై కొనసాగడంతో ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదు­ర్కొ­న్నారు.

పోలీసులు ట్రాఫిక్‌ను క్రమ­బద్ధీక­రిస్తు­న్నప్పటికీ టీడీపీ శ్రేణుల అత్యుత్సాహం ఫలితంగా ప్రయాణికులు అసహ­నానికి గుర­య్యా­రు. కొంతమంది మద్యం మత్తులో రాకపో­కలకు తీ­వ్ర ఇబ్బంది కలిగించారు. ఇక లోకేశ్‌ సమక్షంలో కేడీ­సీసీ బ్యాంకు మాజీ చైర్మన్‌ యార్లగడ్డ వెంకట్రా­వు టీడీపీలో చేరారు. మరోవైపు.. మండల పార్టీ ఇ­చ్చిన రూటుకు భిన్నంగా ఎమ్మెల్యే కార్యాల­యం మీ­దు­గా పాదయాత్ర వెళ్లాని టీడీపీ నేతలు పట్టుబ­ట్టారు. అయితే, పోలీసులు అంగీకరించలే­దు. దీంతో రూట్‌మ్యాప్‌ ప్రకారం పాదయాత్ర కొనసాగింది. 

Videos

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)