Breaking News

మైండ్‌గేమ్‌తో నాడు బాబు.. నేడు రేవంత్‌ మాయ

Published on Mon, 07/08/2024 - 06:15

మానకొండూర్‌ (కరీంనగర్‌): మైండ్‌గేమ్‌తోనే నాడు చంద్రబాబు అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ ప్రభుత్వాన్ని కూల్చారని, ఇప్పుడు సీఎం రేవంత్‌రెడ్డి కూడా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలతో మైండ్‌గేమ్‌ ఆడుతున్నారని కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ అన్నారు. కరీంనగర్‌ జిల్లా మానకొండూర్‌ జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీల వీడ్కోలు కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు.

కార్యక్రమానికి హాజరైన గంగుల మాట్లాడుతూ..‘1995 ఆగస్టు 26న చంద్రబాబును బలపరుస్తూ ఇప్పుడే 110 మంది ఎమ్మెల్యేలు హైదరాబాద్‌లోని వైస్రాయ్‌ హోటల్‌కు చేరుకున్నారని ఈనాడు పత్రిక ఓ కథనా న్ని ప్రచురించింది. అది చూసిన 110 ఎమ్మెల్యేలు అప్పుడు వైస్రాయ్‌ హోటల్‌కు చేరుకున్నారు. అలా ఎమ్మెల్యేలందరూ వెళ్లి ఎన్టీఆర్‌ ప్రభుత్వాన్ని కూలదోశారు..ఇప్పుడు అదేవిధంగా బీఆర్‌ఎస్‌ తరఫున గెలిచిన ఎమ్మెల్యేల్లో 22 మంది చేరుతున్నారని కాంగ్రెస్‌ పార్టీ మైండ్‌గేమ్‌ ఆడుతోంది’అని తెలిపారు.

టీఆర్‌ఎస్‌గా మారుస్తాం..
బీఆర్‌ఎస్‌ పార్టీని తిరిగి టీఆర్‌ఎస్‌గా మారుస్తామని ఇందుకోసం పార్టీ అధినేత కేసీఆర్‌తో చర్చిస్తామని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌ పేర్కొన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి శనివారం నాటి సమావేశంలో హడావుడే తప్ప ఏం సాధించారని ఎద్దేవా చేశా రు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు, వొడితెల సతీశ్‌కుమార్, రసమయి బాలకిషన్, సుంకె రవి శంకర్, మేయర్‌ సునిల్‌రావు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీలు పాల్గొన్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)