Breaking News

జనసేనకు నాలుగు మంత్రి పదవులు!

Published on Sun, 06/09/2024 - 05:50

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జనసేన పార్టీకి నాలుగుకు తక్కువకాకుండా మంత్రి పదవుల కేటాయింపు ఉంటుందని ఆ పార్టీకి చంద్రబాబు నుంచి స్పష్టమైన సంకేతాలు వచ్చాయి. కేంద్ర కేబినెట్‌లో రాష్ట్రానికి దక్కే పదవులతో పాటు రాష్ట్ర మంత్రివర్గంలో బీజేపీకి కేటాయించే పదవులను బట్టి జనసేనకు ఐదో మంత్రి పదవి ఆధారపడి ఉన్నట్లు తెలుస్తోంది.

నిజానికి.. కేంద్రమంత్రి పదవులతో పాటు రాష్ట్ర మంత్రివర్గంలోనూ ఏ పార్టీకి ఎన్ని పదవులన్న దానిపై శనివారమే కొంత స్పష్టత వస్తుందని భావించినప్పటికీ.. చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ ఇద్దరూ రాజకీయేతర కార్యక్రమాలతో బిజీగా ఉండడంతో ఇరువురి మధ్య ఈ అంశం చర్చకు రాలేదని జనసేన వర్గాలు తెలిపాయి. 

మరోవైపు.. రాష్ట్ర కేబినెట్‌లో జనసేన నుంచి అధినేత పవన్‌కళ్యాణ్‌తో పాటు పార్టీ పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ తప్పక ఉంటారని పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. అలాగే, జనసేనలో మిగిలిన పదవులు ఎవరికన్నది టీడీపీలో మంత్రి పదవుల కేటాయింపుపై ఆధారపడి ఉంది. అయితే, పవన్‌ ఇప్పటివరకు ఎవరికీ మంత్రి పదవులపై హామీ ఇవ్వలేదని.. చంద్రబాబుతో భేటీ అనంతరమే ఆయన ఆ వివరాలు వెల్లడిస్తారని పార్టీలో చర్చ జరుగుతోంది.

వీరే ఆశావహులు.. 
ఈ ఎన్నికల్లో జనసేన పోటీచేసిన మొత్తం 21 స్థానాల్లో 15 ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పరిధిలోనే పోటీచేసింది. దీంతో.. పవన్, నాదెండ్లకు కాకుండా జనసేనకు ఇంకెన్ని మంత్రి పదవులు దక్కినా అవి ఆ మూడు జిల్లాలోని వారికే ఇచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. 

ఒకవేళ జనసేనకు ఐదో మంత్రి పదవి దక్కిన పక్షంలో విజయనగరం జిల్లా నెలిమర్ల నుంచి గెలిచిన లోకం నాగమాధవి లేదా తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులలో ఒకరికి అవకాశం కల్పించే అవకాశం ఉంది. ఇక జనసేనలో కొణతాల రామకృష్ణ, సుందరపు విజయకుమార్, దేవవరప్రసాద్, కందుల దుర్గేష్, బొమ్మిడి నారాయణ నాయకర్‌ మంత్రి పదవుల రేసులో ఉన్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)