Breaking News

సాగర్‌ కాలువ గండిని పూడ్చడం చేతకాదా?: హరీశ్‌రావు

Published on Tue, 09/24/2024 - 06:06

సాక్షి, హైదరాబాద్‌: ఖమ్మం జిల్లాలో లక్షల ఎకరాల్లో పంటలు ఎండు తున్నా 22 రోజులుగా నాగార్జున సాగర్‌ కాలువకు పడిన గండిని పూడ్చ డం కాంగ్రెస్‌ ప్రభుత్వానికి చేతకావ డం లేదని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు. కృష్ణా నది నిండుకుండలా ఉన్నా కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతుల పొలాలను ఎండ బెడుతోందన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగే శ్వరరావు గండి పడిన కాలువ పక్క నుంచే వెళ్తున్నా మరమ్మతులు జరగడం లేదని ఎద్దేవా చేశారు.

దీంతో ‘సీఎంను క్షమించు.. రైతులను రక్షించు’అంటూ భద్రాచలం సీతారామచంద్ర స్వామిని వేడుకుంటున్నామని హరీశ్‌రావు అన్నా రు. సోమవారం ఆయన తెలంగాణ భవన్‌లో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే చింత ప్రభా కర్, మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తో కలసి మీడియాతో మాట్లాడుతూ, బీఆర్‌ఎస్‌ తరఫున త్వరలో ఖమ్మం జిల్లాలో పర్యటించి రైతులకు మనోధైర్యం కల్పిస్తామన్నారు.

రైతులతో కన్నీళ్లు పెట్టిస్తున్నారు..
‘పాలేరు, ఖమ్మం, వైరా, సత్తుపల్లి, మధిర నియో జకవర్గాల్లో రైతులు పార్టీలకు అతీతంగా నాగా ర్జునసాగర్‌ ప్రాజెక్టు ఆఫీసులను ముట్టడిస్తూ ధర్నాలు చేస్తున్నారు. ఆకాశాన్ని దించుతాం, సూర్యుడిని వంచుతాం అనే డైలాగులు కొడు తున్న రేవంత్‌ రెడ్డి, జిల్లా మంత్రులకు కాలువ గండి పూడ్చటం చేతకావడం లేదా. 3 లక్షల ఎకరాలు ఎండుతున్నా కాంగ్రెస్‌ సర్కార్‌కు కూల్చి వేతలు తప్ప పూడ్చివేత రాదా? వరదల్లో కొట్టు కుపోయిన పంటలకు నష్టం పరిహారం ఇవ్వకుండా రైతులతో కన్నీళ్లు పెట్టిస్తోంది’అని హరీశ్‌రావు మండిపడ్డారు.

‘వరదల కారణంగా సాగర్‌ పరీవాహక ప్రాంతంలో 60 వేల ఎకరాలు, కాంగ్రెస్‌ నిర్వాకంతో లక్ష ఎకరాలు నష్టపోయినట్లు ప్రాథమికంగా అంచనా. ఇప్పుడు కాంగ్రెస్‌ సర్కా రు నీళ్లిచ్చినా పంటలు చేతికొచ్చే పరిస్థితి లేదు. పంటలను కాపాడుకునేందుకు రైతులు జనరే టర్లు, డిజిల్, ట్రాక్టర్ల కోసం వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. వరదల్లో నష్టపోయిన వారికి ఇస్తున్న పరిహారం రూ.10 వేలు ఏ మూలకూ సరిపోవడం లేదు’అని అన్నారు. రాష్ట్రంలో గూండాయిజం పెరిగి, అత్యాచారాలు నిత్యకృత్యం అయ్యాయన్నారు. రేవంత్‌ అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే రెండు వేల అత్యాచార ఘటనలు చోటు చేసుకున్నాయని హరీశ్‌ పేర్కొన్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)